ప్రముఖ డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ పేటీఎం గూగుల్‌తో పోటీకి దిగింది. గూగుల్ ప్లే స్టోర్‌కు పోటీగా ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను ఆవిష్కరించినట్లు సోమవారం ప్రకటించింది. భారత డెవలపర్లు.. తమ యాప్‌లను సులభంగా ప్రజలకు చేరువ చేసేందుకు మినీ యాప్ స్టోర్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
వివాదం నుంచి యాప్ స్టోర్ వరకు..
జూదానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన కారణంతో.. ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు ఇటీవల పేటీఎం యాప్‌ను తొలగించింది గూగుల్. ఈ అంశంపై పేటీఎం, గూగుల్ మధ్య పరస్పర వాదనలు కూడా జరిగాయి. ఈ పరిణామం జరిగిన కొన్ని వారాల్లోనే పేటీఎం మినీ యాప్ స్టోర్‌ను ఆవిష్కరించడం గమనార్హం.