వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలను పేటీఎం మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్' మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి అందజేసింది. వీటిని సమీక్షించి సెబీ ఆమోదం తెలిపితే.. పేటీఎం ఐపీఓకి మార్గం క్లియర్ అయినట్లే.
ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.16,600 కోట్లు సమీకరించనున్నట్లు సెబీకి పేటీఎం తెలిపింది. వీటిలో తాజా షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద మరో రూ.8,300 కోట్ల విలువ చేసే షేర్లను వాటాదార్లు ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు.