డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం వేదికగా 10 రోజుల్లో పీఎం కేర్స్ నిధికి రూ.100 కోట్లకు పైగా విరాళం సేకరించినట్లు ఆ సంస్థ తెలిపింది.
కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ నిధికి తమ ద్వారా ఎవరైనా విరాళం ఇస్తే.. వారు చెల్లించే మొత్తానికి రూ.10 అదనంగా జమ చేస్తామని పేటీఎం ప్రకటించింది. ఈ విధంగా కరోనా సంక్షోభ నిధికి మొత్తం రూ.500 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా.. రోజువారీ కూలీలకు ఆహారం అందించేందుకు కేవీఎన్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తోంది పేటీఎం.
"10 రోజుల్లో విరాళాలు రూ.100 కోట్లు దాటాయి. మా సంస్థ ఉద్యోగులు కూడా వారి జీతాలను విరాళంగా ఇచ్చారు. 1,200 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. 15 రోజులు, నెల, రెండు నెలలు, 3 నెలల జీతం.. ఇలా వారికి సాధ్యమైనంత మేర విరాళంగా ఉచ్చారు."
- పేటీఎం ప్రకటన