క్యాష్ బ్యాక్ నిబంధనల విషయంలో టెక్ దిగ్గజం గూగుల్‌పై.. దేశీయ డిజిటల్ ఫినాన్స్ సేవల సంస్థ పేటీఎం పలు ఆరోపణలు చేసింది. భారత్‌లో చట్టబద్ధమైన యూపీఐ క్యాష్ బ్యాంక్ ఆఫర్లను ఉపసంహరించుకునేలా తమపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొంది.
గూగుల్ మాత్రం క్యాష్‌బ్యాక్‌లు, ఓచర్లు ఇవ్వడం మాత్రమే.. గూగుల్ ప్లే జూదం నిబంధనల ఉల్లంఘన కాదని అంటోంది. ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే.. గూగుల్ ప్లే డెవలపర్స్ ఖాతాను తొలగిస్తామని కూడా హెచ్చరించింది.
అయితే దీనిపై పేటీఎం వాదన మరోలా ఉంది. క్రికెట్‌కు సంబంధించి.. దాదాపు ఇలాంటి ఆఫర్లనే గూగుల్ పే కూడా అందిస్తోందని.. అయితే గూగుల్ తన సొంత యాప్‌లకు మాత్రం ప్రత్యేక నిబంధనలు పెట్టుకున్నట్లు ఆరోపించింది.