తెలంగాణ

telangana

ETV Bharat / business

'లిబ్రా' నుంచి వైదొలిగిన పేపాల్​.. ఎందుకంటే? - లిబ్రా గ్రూపు నుంచి వైదొలిగిన పేపాల్

ఫేస్​బుక్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్రిప్టోకరెన్సీ 'లిబ్రా' ప్రాజెక్టుకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. లిబ్రాతో కుదుర్చుకున్న భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రముఖ పేమెంట్​ సంస్థ 'పేపాల్' ప్రకటించింది.

paypal withdraw tieup from libra group ఫేస్​బుక్​ క్రిప్టో కరెన్సీ నుంచి పేపాల్ వెనక్కి లిబ్రా గ్రూపు నుంచి వైదొలిగిన పేపాల్

By

Published : Oct 5, 2019, 2:50 PM IST

ఫేస్​బుక్​ క్రిప్టోకరెన్సీ 'లిబ్రా' నుంచి వైదొలుగుతున్నట్లు డిజిటల్ పేమెంట్​ దిగ్గజం పేపాల్ ప్రకటించింది. లిబ్రాకు నియంత్రణ సంస్థల నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో పేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది.

"లిబ్రా సంస్థతో ఉన్న ఒప్పందాన్ని ప్రస్తుతం రద్దుచేసుకుంటున్నాం. భవిష్యత్తులో కలిసి పని చేసే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి." -పేపాల్ ప్రకటన

'లిబ్రా'కు ఆది నుంచి ఎదురుదెబ్బలే...

బిట్​కాయిన్​ తరహాలో.. సొంత క్రిప్టోకరెన్సీ 'లిబ్రా'ను తీసుకురానున్నట్లు ఫేస్​బుక్ ఈ ఏడాది జూన్​లో ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి లిబ్రాను వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మనుగడలో ఉన్న బిట్​కాయిన్​ సహా ఇతర క్రిప్టోకరెన్సీల హవా తగ్గించేందుకు 'లిబ్రా'ను తేనున్నట్లు తెలిపింది.

ఫేస్​బుక్ చేసిన ఈ ప్రకటన తర్వాత.. పలు దేశాల రిజర్వు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు లిబ్రాపై అనుమానాలు వ్యక్తం చేశాయి. లిబ్రాను ఎలా నియంత్రిస్తారనే అంశం మీద ఫేస్​బుక్​పై ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో ఆది నుంచే ఫేస్​బుక్ క్రిప్టో కరెన్సీ వివాదాల్లో చిక్కుకుంది.

ఇదీ చూడండి: దటీజ్ మారుతి... సంక్షోభంలోనూ సూపర్​ హిట్​!

ABOUT THE AUTHOR

...view details