తెలంగాణ

telangana

ETV Bharat / business

నవంబర్​లో మళ్లీ తగ్గిన వాహన విక్రయాలు - నవంబర్​లో తగ్గిన అటోమోబైల్ అమ్మకాలు

పండుగ సీజన్​తో అక్టోబర్​లో కాస్త పుంజుకున్న వాహన విక్రయాలు.. నవంబర్​లో మళ్లీ తగ్గాయి. వ్యాన్ల విక్రయాలు అత్యధికంగా 34 శాతానికిపైగా క్షీణించగా.. ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు అత్యల్పంగా 0.84 శాతం తగ్గినట్లు సియామ్ వెల్లడించింది.

SIAM
సియామ్

By

Published : Dec 10, 2019, 7:01 PM IST

దేశీయంగా వాహనాల అమ్మకాలు నవంబర్​లో మళ్లీ తగ్గినట్లు వాహన తయారీదారుల సంఘం.. 'సియామ్' తెలిపింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్​లో స్వల్పంగా పుంజుకున్న అమ్మకాలు తిరిగి నవంబర్​లో తగ్గడం గమనార్హం.

'సియామ్'​ గణాంకాల ప్రకారం.. 2019 నవంబర్​లో అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 2,63,773. గత ఏడాది ఇదే నెలలో వీటి అమ్మకాలు 2,66,000గా ఉన్నాయి. 2018 నవంబర్​తో పోలిస్తే.. 2019 నవంబర్​లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 0.84 శాతం తగ్గాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు నవంబర్​లో.. 14.98 శాతం తగ్గి.. 61,907 యూనిట్లు విక్రయమైనట్లు సియామ్ పేర్కొంది.

వాహన రకం 2019 నవంబర్ 2018 నవంబర్​ క్షీణత
కార్లు 1,60,306 1,79,783 10.83 శాతం
వ్యాన్లు 10,728 16,333 34.32 శాతం
ద్విచక్ర వాహనాలు 14,10,939 16,45,783 14.27 శాతం
మోటార్​ సైకిళ్లు 8,93,538 10,49,651 14.87 శాతం
స్కూటర్లు 4,59,851 5,21,542 11.83 శాతం

నవంబర్​లో విక్రయాలు తగ్గినప్పటికీ.. ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి పెరిగిందని సియామ్‌ పేర్కొంది. నవంబరులో ఉత్పత్తి 4.06శాతం పెరిగి.. 2,90,727 యూనిట్లను తయారుచేసినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:పందుల దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం!

ABOUT THE AUTHOR

...view details