తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్యాసింజర్​ వాహనాలకు వరుసగా 9వ స్పీడ్​ బ్రేకర్ - కార్ల అమ్మకాలు

దేశీయంగా వాహనాల అమ్మకాలు వరుసగా తొమ్మిదో నెలలోనూ తగ్గాయి. కార్ల అమ్మకాలు అత్యధికంగా 36 శాతం క్షీణించగా.. 31 శాతం తగ్గుదలతో ప్యాసింజర్ వాహనాలు తరువాతి స్థానంలో ఉన్నాయి.

ప్యాసింజర్​ వాహనాలకు వరుసగా 9వ స్పీడ్​ బ్రేకర్

By

Published : Aug 13, 2019, 1:28 PM IST

Updated : Sep 26, 2019, 8:50 PM IST

వరుసగా తొమ్మిదో నెలలోనూ దేశీయ వాహనాల అమ్మకాలు క్షీణించాయి. దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 2019 జులైలో 30.98 శాతం తగ్గాయి. ఇండియన్​ సొసైటీ ఆఫ్​ ఆటోమొబైల్​ మ్యానుఫాక్చరర్స్​(సియామ్​) తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

జులైలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,00,790 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీటి అమ్మకాలు 2,90,931 యూనిట్లుగా ఉన్నాయి.

కార్ల అమ్మకాలు 2018 జులైతో పోల్చితే 2019 జులైలో అత్యధికంగా 35.95 శాతం తగ్గాయి. 2019 జులైలో 1,22,956 యూనిట్లు అమ్ముడవగా.. 2018 జులైలో 1,91,979 కార్లు విక్రయమైనట్లు సియామ్​ పేర్కొంది.

మోటార్ సైకిళ్ల విక్రయాలు గత నెలలో 18.88 శాతం క్షీణించాయి. 2019 జులైలో 9,33,996 మోటార్​ సైకిళ్లు అమ్ముడవగా... 2018 జులైలో 11,51,324 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

ద్విచక్ర వాహనాల అమ్మకాలు జులైలో 16.82 శాతం తగ్గాయి. 2019 జులైలో వీటి అమ్మకాలు 15,11,692 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్​ పేర్కొంది. 2018 జులైలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 18,17,406 యూనిట్లుగా ఉన్నాయి.

వాణిజ్య వాహనాల విక్రయాలు 2019 జులైలో 25,71 శాతం తగ్గి.. 56,866 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో వీటి అమ్మకాలు 76,545 యూనిట్లుగా ఉన్నట్లు సియామ్​ పేర్కొంది.

ఇదీ చూడండి: టీవీతోనే షాపింగ్​, వీడియో కాన్ఫరెన్స్​, ఆన్​లైన్​ గేమ్స్​!

Last Updated : Sep 26, 2019, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details