తెలంగాణ

telangana

ETV Bharat / business

కార్పొరేట్​ల కొవిడ్‌ సాయం- మైక్రోసాఫ్ట్‌ చేయూత - microsoft ready to help india during pandemic

భారత్​లో కరోనా ఉపశమన చర్యలకు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వైద్య ఉత్పత్తులు సరఫరా చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు, వివిధ కార్పొరేట్ సంస్థలు సైతం భారత్​కు అండగా ఉంటామని ముందుకొచ్చాయి.

corporate companies helping india
కార్పొరేట్​ల కొవిడ్‌ సాయం- మైక్రోసాఫ్ట్‌ చేయూత

By

Published : May 6, 2021, 9:13 AM IST

భారత్‌లో కరోనా ఊరట చర్యలు చేపట్టడానికి, వనరులు ఉపయోగించడానికి మైక్రోసాఫ్ట్‌ కట్టుబడి ఉందని ఆ సంస్థ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అయిన సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌కు కీలకమైన మెడికల్‌ సరఫరాలు చేయడానికి అమెరికా వాణిజ్య మండళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. భారత్‌లో కరోనా సాయం కోసం 'గ్లోబల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఆన్‌ పాండామిక్‌ రెస్పాన్స్‌'లో మైక్రోసాఫ్ట్‌ బుధవారం వ్యవస్థాపక సభ్య కంపెనీగా అవతరించింది. భారత్‌కు 25,000 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను, 1000 వెంటిలేటర్లనూ పంపనున్నారు.

  • రాజస్థాన్‌, మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో 300 పడకలతో 4 ఆసుపత్రుల్ని, 2 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు అవాదా ఫౌండేషన్‌ వెల్లడించింది.
  • బీజింగ్‌ నుంచి 3,100 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను వాయుమార్గంలో భారత్‌కు తీసుకు వచ్చినట్లు స్పైస్‌జెట్‌ తెలిపింది.
  • వాల్ట్‌ డిస్నీ కంపెనీ, స్టార్‌ ఇండియా రూ.50 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. గత ఏడాది అందించిన రూ.28 కోట్ల సాయానికి ఇది అదనమని తెలిపాయి.
  • దేశంలోని వివిధ ఆసుపత్రులకు 22 ఆక్సిజన్‌ జనరేటర్లను త్వరలోనే అందించబోతున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రకటించింది.
  • కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు సాయంగా కనెక్టెడ్‌ కార్‌ సిస్టమ్స్‌, ఆడియో, విజువల్‌ ప్రోడక్ట్స్‌ దిగ్గజం హార్మన్‌ రూ.10 కోట్ల విరాళాన్ని పీఎం కేర్స్‌కు అందించనున్నట్లు తెలిపింది.
  • ఫ్రెంచ్‌ కాస్మొటిక్స్‌ దిగ్గజం లోరెల్‌ దేశంలోని పలు ఎన్‌జీవోలతో కలిసి ఆక్సిజన్‌, వైద్య పరికరాల సరఫరా సహా ఆహారం, విద్య, హైజీన్‌ కిట్లను అందిస్తామని వెల్లడించింది.
  • తమ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ఎంజీ మోటార్స్‌ తెలిపింది.
  • స్థిరాస్తి సంస్థ గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ తమ 2,000 మంది శాశ్వత ఉద్యోగులకు, 600 మంది ఒప్పంద ఉద్యోగులకు బుధవారం నుంచి 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. కొవిడ్‌ మహమ్మారి రెండో విజృంభణ నేపథ్యంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ అవకాశం కల్పించినట్లు కంపెనీ తెలిపింది.
  • స్విస్‌ బ్యాంక్‌ యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ భారత్‌లో అత్యవసర, దీర్ఘకాలిక ఉపశమన చర్యలకు 1.5 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11.07 కోట్లు) సాయం ప్రకటించింది.
  • డైరెక్ట్‌ సెల్టింగ్‌ దిగ్గజం ఆమ్‌వే 1 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.5 కోట్లు) కొవిడ్‌ సాయం ఇవ్వనున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details