తెలంగాణ

telangana

ETV Bharat / business

11 ఏళ్లలో రూ.2.05 లక్షల కోట్ల బ్యాంకు మోసాలు

భారతీయ బ్యాంకుల్లో గత 11 ఏళ్లలో 53,334 బ్యాంకు మోసాలు జరిగినట్లు ఆర్బీఐ ఓ సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా తెలిపింది. వీటి విలువ దాదాపు రూ. 2.05 లక్షల కోట్లుగా వెల్లడించింది.

ఆర్బీఐ

By

Published : Jun 12, 2019, 6:06 PM IST

గడచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.2.05 లక్షల కోట్లు విలువైన బ్యాంకు మోసాలు జరిగినట్లు బ్యాంకింగ్ నియంత్ర సంస్థ రిజర్వు బ్యాంక్ ఆఫ్​ ఇండియా వెల్లడించింది. 2008-09 నుంచి 2018-19 మధ్య మొత్తం 53,334 బ్యాంకు మోసాల కేసులు నమోదైనట్లు ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ వెల్లడించింది.

ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 6,811 కేసుల్లో రూ. 5,033.81 కోట్లు మోసపోయింది. ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐకి 6,793 కేసుల్లో రూ.23.734.74 కోట్లు నష్టం జరిగిందని వెల్లడించింది రిజర్వు బ్యాంక్​.

ఇతర ప్రధాన బ్యాంకుల మోసాల లెక్కలు ఇలా...

  1. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు - కేసులు-2,497 -- మొత్తం సొమ్ము- రూ.1,200.79 కోట్లు
  2. బ్యాంక్​ ఆఫ్​ బరోడా - కేసులు-2,160 -- మొత్తం సొమ్ము-రూ.12,962.96 కోట్లు
  3. పంజాబ్ నేషనల్ బ్యాంకు- కేసులు-2,047 -- మొత్తం సొమ్ము-రూ.28,700.74 కోట్లు
  4. యాక్సిస్ బ్యాంకు - కేసులు-1,944 -- మొత్తం సొమ్ము-రూ.12,358.2 కోట్లు
  5. బ్యాంక్​ ఆఫ్ ఇండియా - కేసులు-1,872 -- మొత్తం సొమ్ము-రూ.12,358.2 కోట్లు
  6. సిండికేట్ బ్యాంకు - కేసులు-1,783 -- మొత్తం సొమ్ము-రూ.5,830.85 కోట్లు
  7. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా - కేసులు-1,613 -- మొత్తం సొమ్ము-రూ.9,041.98 కోట్లు
  8. ఐడీబీఐ బ్యాంకు - కేసులు-1,264 -- మొత్తం సొమ్ము-రూ.5,978.96 కోట్లు
  9. స్టాండర్డ్​ చార్టర్డ్​ బ్యాంకు - కేసులు-1,263 -- మొత్తం సొమ్ము-రూ.1,221.41 కోట్లు
  10. కెనరా బ్యాంకు - కేసులు-1,254 -- మొత్తం సొమ్ము-రూ.5,553.38 కోట్లు
  11. యూనియన్ బ్యాంక్ - కేసులు-1,244 -- మొత్తం సొమ్ము-రూ.11,830.74 కోట్లు
  12. కోటక్ బ్యాంకు - కేసులు-1,213 -- మొత్తం సొమ్ము-రూ. 430.46 కోట్లు
  13. ఇండియన్​ ఓవర్​సీస్​ బ్యాంకు- కేసులు-1,115 -- మొత్తం సొమ్ము-రూ. 12,644.7 కోట్లు
  14. యూకో బ్యాంకు - ​ కేసులు-1,081 -- మొత్తం సొమ్ము -రూ.7,104.77 కోట్లు
  15. ఓరియంటల్​ బ్యాంకు - కేసులు-1,040 -- మొత్తం సొమ్ము-రూ. 5,598.23 కోట్లు
  16. విజయా బ్యాంకు - కేసులు-639 -- మొత్తం సొమ్ము-రూ.1,748.9 కోట్లు
  17. లక్ష్మీ విలాస్​ బ్యాంకు - కేసులు-259 -- మొత్తం సొమ్ము-రూ.862.64 కోట్లు
  18. ఎస్​ బ్యాంకు - కేసులు-102 -- మొత్తం సొమ్ము-రూ. 311.96 కోట్లు

5,916 బ్యాంకు మోసాలు అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి. వీటి విలువ రూ.41.167.03 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

వీటితో పాటు అమెరికన్ ఎక్స్​ప్రెస్​, సిటీ యూనియన్​ బ్యాంకు, హెచ్​ఎస్​బీసీ, రాయల్ బ్యాంక్ ఆఫ్​ స్కాట్​లాంట్​ వంటి విదేశీ బ్యాంకుల్లో మొత్తం 5,015 కేసులు నమోదైనట్లు తెలిపింది. వీటి వల్ల ఆయా బ్యాంకులు రూ.989.09‬ కోట్లు మోసపోయినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: నీరవ్​ మోదీకి నాల్గో సారి బెయిల్​ నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details