తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వచ్ఛంద పదవీ విరమణకు 3 రోజుల్లో 40 వేల మంది!

కేవలం మూడు రోజుల్లోనే 40,000 మంది బీఎస్ఎన్​ఎల్​ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి వెల్లడించారు. గడువులోపు 80 వేల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముందని బీఎస్​ఎన్​ఎల్​ భావిస్తోంది.

బీఎస్​ఎన్​ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ

By

Published : Nov 8, 2019, 8:30 PM IST

బీఎస్​ఎన్​ఎల్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్​ఎస్​)కు భారీ స్పందన వస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే 40,000 మంది వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.

అసలెందుకు వీఆర్​ఎస్​...

అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్​ఎల్​ సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం ఇటీవల రూ.69,000 కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది. వ్యయాలను తగ్గించుకునేందుకు ఆయా సంస్థల ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి అక్టోబర్ 5 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి బీఎస్​ఎన్​ఎల్, ఎంటీఎన్ఎల్​లు. డిసెంబర్​ 3ను చివరి తేదిగా నిర్ణయించాయి.

"వీఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకున్న వారిలో.. 26 వేల మంది గ్రూప్ సీ క్యాడెర్​కు చెందిన వారు. అన్ని క్యాడెర్​ల నుంచి మంచి స్పందన వస్తోంది."
- పి.కె.పర్వార్​, బీఎస్​ఎన్​ఎల్​ ఛైర్మన్​

వీఆర్​ఎస్​ పథకాన్ని 70 నుంచి 80 వేల మంది ఉద్యోగులు వినియోగించుకుంటారని బీఎస్​ఎన్ఎల్​ భావిస్తోంది. దీని ద్వారా రూ.7,000 కోట్లు వ్యయంలో ఆదా అవుతుందని అంచనా.

ABOUT THE AUTHOR

...view details