గత 9 నెలల నుంచి వాహన రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. జులైలో అత్యల్ప వాహన అమ్మకాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యయాలు తగ్గించుకునే పనిలో పడ్డాయి ఆటోమొబైల్ సంస్థలు.
మారుతీ సుజుకీ.. 3,000 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలిగించింది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ఛైర్మన్ ఆర్సీ భార్గవ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.
"అమ్మకాల్లో మందగమనం కారణంగా తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టును పునరుద్ధరించలేదు. దీని ప్రభావం శాశ్వత ఉద్యోగులపై ఉండదు. డిమాండుకు తగ్గట్లు ఉద్యోగులను పెంచుకోవడం, తగ్గించుకోవడం జరుగుతుంది. ఇదంతా వ్యాపారంలో భాగమే."
- ఆర్సీ భార్గవ, ఎంఎస్ఐ ఛైర్మన్
ఆటోమొబైల్ పరిశ్రమ ద్వారా అమ్మకాలు, సర్వీసులు, బీమా, లైసెన్స్, ఫినాన్సింగ్, విడిభాగాలు, డ్రైవర్లు, పెట్రోల్ పంపులు, రవాణా రంగాల్లో ఉద్యోగ కల్పన జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. అమ్మకాల విభాగంలో ఎక్కువగా ఉద్యోగాలు కోతకు గురయ్యే అవకాశం ఉందని భార్గవ తెలిపారు.