తెలంగాణ

telangana

ETV Bharat / business

నెలాఖరున మార్కెట్లోకి 'ఒప్పో 5జీ' సిరీస్​ ఫోన్లు - LATEST BUSINESS NEWS

చైనా మొబైల్​ దిగ్గజం రెడ్​మీకి పోటీగా ఒప్పో దూసుకొస్తోంది. ఈ నెలాఖర్లో 5జీ ఫీచర్స్​​తో సరికొత్త మొబైల్​ సిరీస్​లను మార్కెట్​లోకి తీసుకురానుందీ సంస్థ.

Oppo Reno 3 Series to Launch on December 26; Realme X50 Confirmed to Feature Snapdragon 765G SoC
5జీ సిరీస్​తో వస్తున్న ఒప్పో

By

Published : Dec 14, 2019, 7:52 AM IST

Updated : Dec 14, 2019, 10:41 AM IST

ప్రముఖ స్మార్ట్​ ఫోన్​ దిగ్గజం రెడ్​మీకి పోటీగా ఒప్పో సరికొత్త ఫోన్లను మార్కెట్​లోకి తీసుకురానుంది. ఒప్పో రెనో 3 తో పాటు రెనో 3ప్రో 5జీ సిరీస్​లను అందుబాటులోకి తేనుంది. రెడ్​మీ కె30 4జీ సిరీస్​కు పోటీగా ఒప్పో సంస్థ ఈ ఫోన్లను తీసుకొస్తోంది. ఈ నెల 26న రెనో 3ని మార్కెట్​లోకి విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే వీటికోసం నమోదు​ చేసుకొనే సదుపాయం కల్పించింది సంస్థ. ఆండ్రాయిడ్​ 10 ఆధారంగా కలర్ ఓఎస్​ 7తో వచ్చిన మొట్టమొదటి ఫోన్లుగా నిలిచాయి రెనో 3, రెనో 3ప్రో . అయితే రెనో​ 3ప్రో 5జీ ఫోన్​ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రెనో 3 ఫీచర్లు ఇలా

  • స్నాప్​ డ్రాగన్​ 765 చిప్​సెట్​ ప్రాసెసర్​
  • పంచ్​ హోల్​ డిస్​ప్లే
  • ఫింగర్ ప్రింట్​ స్కానర్​
  • క్వాడ్​ కెమెరా
  • 4000ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ

మరోవైపు ఒప్పో అనుబంధ సంస్థ రియల్​మీ సిరీస్​లోని 'ఎక్స్​50'.. క్వాల్కమ్​ స్నాప్​ డ్రాగన్​ 765 చిప్​సెట్ అనే ప్రాసెసర్​తో మార్కెట్​లోకి రానున్నట్లు తెలిపింది. రియల్​మీ ఎక్స్ 50కి ఉండే స్పెసిఫికేషన్స్​ ఇకపై రెనో 3ప్రో 5జీకి సమానంగా ఉంటాయి.

ప్రస్తుతం 5జీ నెట్​వర్క్​ సపోర్ట్​తో రెడ్​మీ కే30 మార్కెట్​లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. వీటి ప్రారంభ ధర రూ.20,500నుంచి ఉంది రెడ్​మి కె 30 మొబైల్​లో అద్భుతమైన స్పెసిఫికేషన్స్​ కలిగి ఉంది. అయితే ఒప్పో రెనో 3 ప్రో 5జీ ధర వివరాలు మాత్రం ప్రకటించలేదు. కానీ వినియోగదారుని ఆకర్షించే విధంగా ఒప్పో ధరలు నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో రెడ్​మీ, ఒప్పోలతో పాటు సరసమైన 5జీ స్మార్ట్​ఫోన్​లను వినియోగదారులకు అందించే రేస్​లో రియల్​మీ కూడా చేరనుంది.

ఇదీ చూడండి: ఉంటుందా.. ఊడుతుందా? ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన

Last Updated : Dec 14, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details