తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగు కెమెరాలతో ఒప్పో 'రెనో2'.. ధరెంతో తెలుసా? - నాలుగు కెమెరాలు

ప్రీమియం స్మార్ట్​ఫోన్ విభాగంలో మరో కొత్త మోడల్​ను తీసుకురానుంది చైనా దిగ్గజ మొబైల్​ సంస్థ 'ఒప్పో'. 'రెనో 2' పేరుతో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్​ ఫోన్.. వెనుకవైపు 4 కెమెరాలు ఉంటాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఒప్పో

By

Published : Aug 17, 2019, 11:05 AM IST

Updated : Sep 27, 2019, 6:41 AM IST

'ఒప్పో' రెనో శ్రేణిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్​ను భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ నెల 28న 'రెనో2'ను ఆవిష్కరించనున్నట్లు 'ఒప్పో' ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది.

ప్రీమియం విభాగంలో వస్తున్న ఈ ఫోన్​ వెనుకవైపు నాలుగు కెమెరాలతో.. 20X జూమ్​తో రానున్నట్లు 'ఒప్పో' పేర్కొంది. ఈ నేపథ్యంలో 'రెనో 2'పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఫోన్​ ధర దాదాపు రూ. 40,000లకు పైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి టెక్ వర్గాలు.

ఇతర ఫీచర్లపై అంచనాలు ఇలా...

  • 6.3 అంగుళాల అమోలెడ్ డిస్​ప్లే.. పూర్తి హెచ్​డీ
  • క్వాడ్​ కెమెరా 48 మెగా పిక్సల్​..డ్యూయల్ ఎల్​ఈడీ ఫ్లాష్​
  • 16 మెగా పిక్సల్​ల సెల్ఫీ కెమెరా
  • రాత్రి పూట ఫొటోలు తీసుకునేందుకు వీలుగా అల్ట్రా డార్క్​ మోడ్​
  • ఆండ్రాయిడ్​ 9పై వర్షన్​
  • క్వాల్​కామ్​ 700 సిరీస్​ ఆక్టా కోర్​ ప్రాసెసర్​
  • 4,065 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్​ ఛార్జింగ్ సదుపాయం

ఇదీ చూడండి: 5 ట్రిలియన్ డాలర్ల​ ఆర్థిక వ్యవస్థ సాధనకు సూచనలివ్వండి!

Last Updated : Sep 27, 2019, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details