కరోనా నేపథ్యంలో చాలా మంది ఇంటికి కావాల్సిన నిత్యావసరాలను ఆన్లైన్లో కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 నాటికి ఆసియా ఆన్లైన్ విక్రయాలు 2.5 ట్రిలియన్ డాలర్లు దాటొచ్చని ప్రముఖ మార్కెట్ విశ్లేషణ సంస్థ ఫొర్రెస్టర్ అంచనా వేసింది. 2019లో ఈ విలువ 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. 2024 నాటికి ఆన్లైన్ రిటైల్ వార్షిక వృద్ధి రేటు 11.3 శాతంగా నమోదవ్వచ్చని పేర్కొంది.
కరోనా వల్ల నిత్యావసరాలకు ఆన్లైన్ పోర్టల్‌ల వాడకం భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆన్లైన్లో గ్రోసరీ కొనుగోళ్లు 30 శాతం పెరినట్లు అంచనా. ఆన్లైన్లో కొత్తగా కొనుగోళ్లు జరిపేవారు 2020లో 5.1 శాతం.. 2024 నాటికి 10.6 శాతం పెరగొచ్చని సర్వే పేర్కొంది.
"2019 లెక్కల ప్రకారం రిటైల్ అమ్మకాల్లో గ్రోసరీ విభాగం వాటా 35 శాతంగా ఉంది. అయితే అందులో ఆన్లైన్ రిటైల్ వాటా 6 శాతం మాత్రమే. అందుకే రిటైలర్లకు ఇది కీలకమైన విభాగంగా మారొచ్చు. ఫలితంగా ఆన్లైన్ రిటైల్ విక్రయాల వృద్ధికి తోడ్పడొచ్చు. ఆన్లైన్ గ్రోసరీ రిటైల్ విక్రయాల విలువ 2024 నాటికి 559 బిలియన్ డాలర్లకు పెరగొచ్చు. "
- సతీశ్ మీనా, ఫొర్రెస్టర్ సీనియర్ విశ్లేషకులు
సర్వేలోని మరిన్ని విషయాలు..
- భారత్‌లో ఆన్లైన్లో గ్రోసరీ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.
- గ్రోసరీ రిటైల్ వ్యాపారాల్లో.. ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్స్ కొనుగోలు చేయడం కీలక పరిణామం.
- గ్రోసరీ రిటైల్ పరంగా 2019-20లో రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ.346 బిలియన్లుగా ఉంది. ఫ్యూచర్ రిటైల్ వార్షిక ఆదాయం గత ఆర్థిక సంవత్సరం రూ.100 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
- ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్యంతో ఆన్లైన్ రిటైల్ గ్రోసరీ వ్యాపారాల్లో రిలయన్స్ మార్కెట్ లీడర్‌గా ఎదగొచ్చని పలు నివేదికలు అప్పట్లో అంచనా వేశాయి.
- వచ్చే ఐదేళ్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విభాగాల్లో గ్రోసరీ కూడా ఒకటిగా ఉండనుంది.
- కరోనా వల్ల ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. ఇదే సమయంలో ఆదాయం తగ్గడం వల్ల వినియోగదారులు వెచ్చించే మొత్తాలు తగ్గాయి.
- ఆన్లైన్ రిటైల్ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరి.. 2024 నాటికి 50 శాతం మార్కెట్ వాటాతో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండే అవకాశముంది.
- ఐరోపా, అమెరికాకు భిన్నంగా ఆసియా ప్రాంతంలో స్మార్ట్ఫోన్ల ద్వారానే ఎక్కువగా ఆన్లైన్ కొనుగోళ్లు జరుగుతాయి.
ఇదీ చూడండి:U, V కానేకాదు.. ఇది 'K-షేప్' రికవరీ!