తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రతి ముగ్గురిలో ఒక ఇంటర్నెట్​ యూజర్​పై సైబర్​ దాడి!

దేశవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒక ఇంటర్నెట్ యూజర్​ సైబర్​దాడులకు గురవుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సైబర్​దాడులు వేగంగా పెరుగుతున్నట్లు ఈ సర్వే తెలిపింది.

సైబర్​దాడులు

By

Published : Sep 12, 2019, 5:52 PM IST

Updated : Sep 30, 2019, 9:04 AM IST

దేశంలో ఇంటర్నెట్​ యూజర్లపై ఇటీవల సైబర్ దాడులు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో.. ప్రతి ముగ్గురిలో ఒక ఇంటర్నెట్ యూజర్ సైబర్​ దాడుల బారిన పడినట్లు ఓ సర్వే వెల్లడించింది. 'సైబర్​ నేరాల నిఘా' పేరుతో కే7 కంప్యూటింగ్ లిమిటెడ్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో పలు కీలక విషయాలు తెలిశాయి.

ముఖ్యంగా హైదరాబాద్​, చెన్నై, బెంగళూరు, గువాహటి, పట్నా నగరాల్లో ఈ సైబర్​ దాడులు అధికంగా జరుగుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది.

నగరాల వారీగా సైబర్​దాడులు ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్​-జూన్​ మూడు నెలల మధ్య పట్నా, చెన్నైలలో అత్యధికంగా 48 శాతం సైబర్​దాడులు జరిగాయి. గువాహటిలో 46 శాతం, లఖ్​నవూలో 45 శాతం, కోల్​కతాలో 41 శాతం సైబర్​దాడులు నమోదయ్యాయి. దిల్లీలో అత్యల్పంగా 28 శాతం సైబర్​ దాడులు జరిగాయని సర్వేలో తేలింది.

వ్యాపార సముదాయాలు, స్మార్ట్​ ఫోన్లు, విండోస్​, ఇంటర్​నెట్ ఆఫ్​ థింగ్స్​లపై దేశవ్యాప్తంగా 20 పట్టణాల్లో ఈ సర్వే జరిగింది. టైర్-1, టైర్​-2 పట్టణాల్లో సైబర్​ దాడులు వేగంగా పెరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ఇదీ చూడండి: ఫ్లిప్​కార్ట్ బిగ్​బిలియన్​ డేస్​ ప్రత్యేక ఆఫర్లు ఇవే!

Last Updated : Sep 30, 2019, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details