తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశీయ అతిపెద్ద కంపెనీగా టీసీఎస్​ - రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్​

రిలయన్స్ ఇండస్ట్రీస్​ను వెనక్కి నెట్టి.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) దేశంలో అతిపెద్ద లిస్టెడ్​ కంపెనీగా అవతరించింది. టీసీఎస్​ ఎం క్యాప్​ ప్రస్తుతం రూ.12.45 లక్షల కోట్లుగా ఉంది.

TCS is the Most valued company in India
అతి పెద్ద దేశీయ కంపెనీగా టీసీఎస్​

By

Published : Jan 25, 2021, 2:50 PM IST

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) దేశంలోనే అతిపెద్ద లిస్టెండ్​ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్​ను వెనక్కి నెట్టి ఈ ఘనతను సాధించింది టీసీఎస్​.

సోమవారం నాటి లెక్కల ప్రకారం టీసీఎస్​ మార్కెట్ క్యాపిటల్​ (ఎం-క్యాప్) రూ.12,45,341.44 కోట్లుగా ఉంది. టీసీఎస్​ దేశీయ అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించడం 2020 మార్చి తర్వాత ఇది రెండో సారి కావడం విశేషం.

సంస్థ షేర్లు దాదాపు 5 శాతం క్షీణించిన కారణంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం క్యాప్ రూ.12,42,593.78 కోట్లకు తగ్గింది. ఫలితంగా దేశీయ అతి పెద్ద లిస్టెడ్​ కంపెనీ రికార్డును కోల్పోయింది.

ఇదీ చూడండి:రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనం

ABOUT THE AUTHOR

...view details