దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తాము తీసుకువస్తున్న స్కూటర్‌ను పది రంగుల్లో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఓలా స్కూటర్ రంగులు ఇలా..
- నలుపు (మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్)
- నీలం (మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్)
- ఎరుపు
- పింక్
- పసుపు
- తెలుపు
- సిల్వర్
వీటితో పాటు మరో రంగుపై సంస్థ ప్రకటించాల్సి ఉంది. ఇటీవల ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే లక్ష మంది బుక్ చేసుకోవడం విశేషం.
ఓలా స్కూటర్ అందుబాటులోకి రానున్న రంగులకు సంబంధించిన ఓ టీజర్‌ను ఓలా ఎలక్ట్రిక్ యూట్యూబ్‌లో పెట్టింది. దీనిలో స్కూటర్ రూపకల్పను వివరించింది.
"ఓలా స్కూటర్ వినియోగదారులకు గొప్ప స్కూటర్ అనుభవాన్ని ఇస్తుంది. క్లాస్ లీడింగ్ స్పీడ్, వైడ్ రేంజ్, బూట్ స్పేస్, గ్లోబల్ డిజైన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ స్కూటర్ సొంతం. అంతేగాక ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయగలిగేలా ధరలో ఇది అందుబాటులో ఉంటుంది."