రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఉన్న డేటా ఛార్జీల మోతకు జియో అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాల వినియోగం భారీగా పెరిగింది. ఇంటర్నెట్ వినియోగంతో గూగుల్‌కు చెందిన వీడియో సేవల విభాగం యూట్యూబ్‌కు వీక్షకులుభారీగా పెరిగారు. వీరు అధిక శాతం వీక్షించే వీడియోలు మాతృ భాషల్లోనే ఉంటున్నాయి. ఈ పరిమాణాల్లో వీక్షకులను ఆకర్షించేందుకు.. ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ వంటి స్థానిక భాషల్లో కంటెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించే కంటెంట్ రూపకర్తలు.. ఇటీవలి కాలంలో చిన్న పట్ణణాలు, టౌన్లలోనూ పెరిగిపోయారు.
భారత్‌లో తమ వినియోగదారులు 'టై ఎలా కట్టుకోవాలి' అనే చిన్న చిన్న విషయాలు నుంచి వ్యవసాయ సంబంధిత అంశాలను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటున్నారని యూట్యూబ్ ఫ్యామిలీ, లెర్నింగ్ భాగస్వామ్య అధిపతి డాన్ అండర్సన్ తెలిపారు.