కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్)ను డీఫాల్టర్‌గా ప్రకటించింది జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ). స్టాక్ మార్కెట్ నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అదనంగా ఎన్ఎస్ఈ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.
ఎన్ఎస్ఈ ఆదేశాలు నవంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చాయి.
క్లయింట్ అనుమతి లేకుండా..
తమ ఖాతాదారుల షేర్లను, వారి అనుమతి లేకుండా తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన కేఎస్‌బీఎల్, వాటిని గ్రూపు కంపెనీల్లోకి తరలించిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) తమ విచారణ నివేదికలో వెల్లడించింది. నేరపూరిత ఉద్దేశంతో ఇలా చేసేందుకు 9 కంపెనీలను వాడుకుందని పేర్కొంది.
ఎన్ఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం స్టాక్ బ్రోకర్ సంస్థలు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేదని నిబంధనలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కార్వీ చర్యలు