దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తమ సంస్థకు కొత్త ఎండీని నియమించే పనిలో ఉన్నారు. సెబీ నూతన నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త ఎండీ కోసం అన్వేషిస్తున్నారు. మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ బాధ్యతలు వేర్వేరుగా ఉండాలని సెబీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెబీ నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
"కంపెనీలో ఎంతో మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. అందులో అంబానీ ముందు వరుసలో ఉంటారు. అయితే సెబీ నిబంధనల ప్రకారం ఆయన ఎండీగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. అలాగే ఎండీగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి అంబానీ కుటుంబం నుంచి ఉండబోరు"
- విశ్వసనీయ వర్గాల సమాచారం
కనుక రిలయన్స్ కొత్త ఎండీగా అంబానీయేతర వ్యక్తి ఉండబోతున్నారని తేలింది. సంస్థ కార్యనిర్వాహక డైరక్టర్ నిఖిల్ మేస్వానీ, ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడు మనోజ్ మోదీ ప్రధానంగా ఎండీ రేసులో ఉన్నారు. మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు నిఖిల్ మేస్వానీ సోదరుడు హితల్ మేస్వానీ, పీఎమ్ఎస్ ప్రసాద్ కూడా ప్రతిపాదిత జాబితాలో ఉన్నట్లు సమాచారం.
ఎవరీ మేస్వానీ...?
మేస్వానీ సోదరులు 1990వ దశకం నుంచి రిలయన్స్ బోర్డ్‌లో సభ్యులు. వీరు ముకేశ్ అంబానీకి బంధువులు. వారి తండ్రి రసిక్లాల్ మేస్వానీ... రిలయన్స్ పరిశ్రమల వ్యవస్థాపక డైరక్టర్లలో ఒకరు.
ఎవరీ మోదీ...?