పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్టోబర్ 17 వరకు కస్టడీని పొడిగించింది లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్డు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. లండన్ జైలు నుంచి నీరవ్ మోదీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం నీరవ్ కస్టడీ పెంచుతూ ఉత్తర్వులిచ్చింది కోర్టు. నీరవ్ మోదీ విచారణ వచ్చే ఏడాది మే 11 నుంచి 15 వరకు ఉండొచ్చని తెలిసింది.
మరో నెల రోజులు జైల్లోనే నీరవ్ మోదీ - లండన్ కోర్టు
లండన్ కోర్టులో నీరవ్ మోదీకి మరో సారి చుక్కెదురైంది. పీఎన్బీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ను నేడు విచారించిన లండన్ కోర్టు.. వచ్చే నెల 17 వరకు కస్టడీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
నీరవ్ మోదీ
ఈ ఏడాది మార్చి19న నీరవ్ మోదీని అరెస్టు చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచారు. ఇది లండన్‌లో అత్యంత రద్దీగా ఉండే కారాగారాల్లో ఒకటి. అంతకు ముందు నుంచే భారత దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు నీరవ్‌ను భారత్‌కు రప్పించేందుకు చాలా ప్రయత్నించాయి. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ వాటికి స్పందించలేదు.
ఇదీ చూడండి: ఉద్దీపన పథకాలు ఇప్పుడే వద్దు: దువ్వూరి సుబ్పారావు
Last Updated : Oct 1, 2019, 5:36 AM IST