భారత్లో ప్రతి 10 మంది కొత్త ఇంటర్నెట్ యూజర్లలో 9 మంది ప్రాంతీయ భాషల్లోనే అంతర్జాలాన్ని వినియోగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015-18 మధ్యకాలంలో 4 కోట్ల మంది నూతనంగా అంతర్జాలాన్ని వాడటం ప్రారంభించించారు.
భారతీయ భాషల్లో ఇంటర్నెట్ వినియోగించే వారు ఎక్కువే! - తెలుగు బిజినెస్ న్యూస్
భారత్లో కొత్తగా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 2015 నుంచి 2018 మధ్య కాలంలో 4 కోట్లు పెరిగినట్లు గూగుల్ ఇండియా తెలిపింది. వీరిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది ప్రాంతీయ భాషల్లోనే అంతర్జాలాన్ని వాడేందుకు ఇష్టపడుతున్నట్లు వెల్లడించింది.
గూగుల్
అయితే హిందీలో వెబ్ వినియోగం 2015-16 మధ్యకాలంలో 90 శాతం వృద్ధి చెందగా.. ఇంగ్లీష్ కంటెంట్ వినియోగం 19 శాతమే పెరిగినట్లు గూగుల్ ఇండియా ఉత్పత్తి నిర్వహణ అధికారి నిధి గుప్త తెలిపారు. గూగుల్ ఉత్పత్తుల వినియోగంలో ఇంగ్లీష్ తర్వాత.. హిందీ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.