తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫీ గోల్​మాల్​ ఆరోపణలపై దర్యాప్తులు ముమ్మరం - ఇన్ఫీపై దర్యాప్తు ముమ్మరం

ఇన్ఫోసిన్ సీఈఓ, సీఎఫ్ఓలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తునకు సిద్ధమైంది. సంస్థ ఆడిటింగ్​ను పునఃపరిశీలించాలని జాతీయ ఆర్థిక నివేదనల ప్రాధికార సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇన్ఫీ కూడా ఈ విషయంపై స్వతంత్ర దర్యాప్తు చేయిస్తోంది.

ఇన్ఫీ గోల్​మాల్​ ఆరోపణలపై దర్యాప్తులు ముమ్మరం

By

Published : Oct 24, 2019, 12:54 PM IST

దేశీయ టెక్​ దిగ్గజం ఇన్ఫోసిస్​పై వచ్చిన అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇన్ఫీ ఆడిటింగ్​ను పునఃపరిశీలించాలని జాతీయ ఆర్థిక నివేదనల ప్రాధికార సంస్థ (ఎన్​ఎఫ్​ఆర్​ఏ)ను కోరింది.

ఎన్​ఎఫ్​అర్​ఏ... కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే స్వతంత్ర ఆడిటింగ్​ నియంత్రణ ప్రాధికార సంస్థ.

ఇన్ఫీపై అరోపణలు ఇవే..

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రధాన అధికారులపై ఉద్యోగులమని చెప్పుకుంటున్న గుర్తు తెలియని బృందం ఒకటి తీవ్ర ఆరోపణలు చేసింది. స్వల్పకాలంలో ఆదాయ, లాభాలను పెంచడం కోసం కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సంస్థ బోర్డుతో పాటు అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు ఆ బృందం లేఖ రాసింది.

ఇటీవలి కొన్ని త్రైమాసికాలతో పాటు.. ప్రస్తుత త్రైమాసికంలోనూ అదే తరహా చర్యలు చేపట్టినట్లు సెప్టెంబరు 20 తేదీతో ఉన్న ఆ లేఖలో వారు ఆరోపించారు. నైతిక ఉద్యోగులు, 'ప్రజావేగులు'గా తమకు తాము చెప్పుకున్న ఆ బృందం.. ఇందుకు సంబంధించి సాక్ష్యాలుగా పలు ఈ-మెయిళ్లు, వాయిస్‌రికార్డులు ఉన్నట్లు తెలిపింది. బోర్డు తక్షణం దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు అందులో పేర్కొంది.

రంగంలోకి సెబీ..

అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్​పై భారత స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణ సంస్థ సెబీ, అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి.
వీటితో పాటు.. తమ అడిటింగ్ సంస్థ, ఓ న్యాయ సంస్థల ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు.. ఇన్ఫీ ఛైర్మన్​ నందన్​ నీలేకనీ ఇప్పటికే వెల్లడించారు.

ఇదీ చూడంండి: భారత్​లో ఇప్పుడు మరింత 'ఈజీ'- ర్యాంక్​ 63

ABOUT THE AUTHOR

...view details