తెలంగాణ

telangana

ETV Bharat / business

హ్యుందాయ్​ రెండోతరం 'క్రెటా' వచ్చేది అప్పుడే! - హ్యుంగాయ్​ క్రెటా లేటెస్ట్​ న్యూస్

భారత మార్కెట్లోకి క్రెటా రెండోతరం మోడల్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది హ్యుందాయ్​. ఈ నెల 6న జరిగే ఆటో ఎక్స్​పోలో ఈ కారును ప్రదర్శించనుంది హ్యుందాయ్​. ఆ తర్వాత మార్కెట్లోకి ఈ మోడల్​ ఎప్పుడు రానుంది? కొత్త మోడల్​లో ఎలాంటి మార్పులు ఉండనున్నాయి? పూర్తి వివరాలు మీ కోసం.

creta
హ్యుందాయ్​

By

Published : Feb 3, 2020, 1:34 PM IST

Updated : Feb 29, 2020, 12:05 AM IST

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ రెండోతరం క్రెటా మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. కొత్త తరం క్రెటాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన డిజైన్‌ స్కెచ్‌ను హ్యుందాయ్‌ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ కారును చైనాలో విడుదల చేసిన ఐఎక్స్‌25 స్ఫూర్తితో హ్యుందాయ్‌ డిజైన్‌ చేసింది. ప్రస్తుత క్రెటా కంటే ఇది భారీగా కనిపిస్తోంది. కారు గ్రిల్స్‌ను భారీగా పెంచేశారు. ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ టైల్‌లైట్స్‌లోనూ మార్పులు చేశారు. భారత్​లో ఈ నెల 6న ఆటోఎక్స్​పోలో ఈ కారును ప్రదర్శించనుంది హ్యుందాయ్.

ఇంటీరియర్​లో మార్పులు..

ఈ కారు ఇంటీరియర్‌లోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ అమర్చినట్లు సమాచారం. ఇక హ్యూందాయ్‌ బ్లూలింక్‌ కనెక్టెడ్‌ కార్‌ యాప్‌, ఈసిమ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌ వీల్‌ అదనపు ఆకర్షణగా నిలవనుంది. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. సన్‌రూఫ్‌, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ వంటివి ఇందులో ఉండనున్నాయి..

ధర ఎంత?

రెండోతరం క్రెటాను పెట్రోల్​, డీజిల్​ వేరియంట్లలో అందుబాటులోకి తేనుంది హ్యుందాయ్​. వీటి వేరియంట్ల ధరలు రూ. 9.5 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి ఆటో పరిశ్రమ వర్గాలు.

ఇదీ చూడండి:దక్షిణాది రాష్ట్రాలకు 'ఆర్థిక' సంకెళ్లు!

Last Updated : Feb 29, 2020, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details