తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

mstry
టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

By

Published : Dec 18, 2019, 3:28 PM IST

Updated : Dec 18, 2019, 4:36 PM IST

16:26 December 18

భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూపునకు షాకిచ్చింది జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రైబ్యునల్. టాటా సన్స్ సంస్థకు సైరస్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా ఎన్​. చంద్ర నియామకం అక్రమమని తీర్పు ఇచ్చింది ట్రైబ్యునల్. అయితే పునర్నియామకానికి నాలుగు వారాల గడువు విధించింది. ఈ సమయంలో టాటా సన్స్ సంస్థ అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

షాపూర్​జీ పల్లోంజీ వ్యాపార సంస్థ వారసుడైన సైరస్ మిస్త్రీ 2012లో టాటా సన్స్​కు అధినేత అయ్యారు. తర్వాత మారిన పరిస్థితుల మధ్య 2016 అక్టోబర్లో టాటా సన్స్ బాధ్యతల నుంచి మిస్త్రీని తప్పించారు. అనంతర కాలంలో టాటా సన్స్ గ్రూప్​ బోర్డు సభ్యుడిగానూ మిస్త్రీని తొలగించారు. ఈ నేపథ్యంలో టాటా సన్స్​లో 18.4 శాతం వాటాతో మైనారిటీ వాటాదారుగా ఉన్న మిస్త్రీ గ్రూప్ షాపూర్​జీ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది. అయితే ఈ కేసును ఎన్​సీఎల్​టీ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అపీలేట్ ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు మిస్త్రీ. విచారణ అనంతరం సైరస్​ను తిరిగి ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్​గా నియమించాలంటూ అపీలేట్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.

15:25 December 18

టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

టాటా సన్స్​పై కేసులో అసాధారణ విజయం సాధించారు సైరస్ మిస్త్రీ. మిస్త్రీని టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా నియమిస్తూ జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్​. చంద్రను ఛైర్మన్​గా నియమించడం అక్రమమని తీర్పు ఇచ్చింది. 

Last Updated : Dec 18, 2019, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details