తెలంగాణ

telangana

ETV Bharat / business

మిస్త్రీ కేసు: ఆర్​ఓసీ విజ్ఞప్తిపై ఉత్తర్వులు రిజర్వ్​

సైరస్​ మిస్త్రీని టాటా సన్స్​ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పునర్​ నియమిస్తూ ఇచ్చిన తీర్పులో మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్​పై తీర్పును నిలిపి ఉంచింది ఎన్​సీఎల్​ఏటీ. ఈనెల 6న  తీర్పు ఉండవచ్చనే సంకేతాలిచ్చింది.

TATA
మిస్త్రీ వివాదం

By

Published : Jan 3, 2020, 1:40 PM IST

టాటా సన్స్, సైరస్​ మిస్త్రీ కేసు తీర్పులో మార్పులు చేయాలని రిజస్ట్రీ ఆఫ్​ కంపెనీస్​ (ఆర్​ఓసీ) దాఖాలు చేసిన పిటిషన్​పై తీర్పును రిజర్వులో ఉంచింది జాతీయ కంపెనీ లా అప్పిలేట్​ ట్రైబ్యునల్​ (ఎన్​సీఎల్​ఏటీ).

జస్టిస్​ ఎస్​.జె.ముఖ్తోపాధ్యాయ ఛైర్మన్​గా ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం..ఆర్​ఓసీ పిటిషన్​పై తీర్పు వచ్చే సోమవారం వెలువడే అవకాశముందని సంకేతాలిచ్చింది.

టాటా సన్స్ కార్యనిర్వహక అధ్యక్షుడుగా సైరస్ మిస్త్రీని పునర్​నియమించాలని ఎన్​సీఎల్​ఏటీ 2019 డిసెంబర్​ 18న తీర్పునిచ్చింది. మిస్త్రీ నియామకం నాలుగు వారాల తర్వాత అమల్లోకి వస్తుందని.. ఈ లోపు టాటా సన్స్​ అప్పీలుకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అప్లిలేట్ ట్రైబ్యునల్​ తీర్పును సవాల్​ చేస్తూ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది టాటా సన్స్.

ఇదీ చూడండి:కష్టకాలం:20 ఏళ్ల కనిష్ఠానికి వాహన విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details