తెలంగాణ

telangana

ETV Bharat / business

మిస్త్రీ కేసు: ఆర్​ఓసీ వ్యాజ్యాన్ని కొట్టివేసిన ఎన్​సీఎల్​ఏటీ

టాటా సన్స్​ సీఈఓగా సైరస్​ మిస్త్రీని పునర్​ నియమిస్తూ ఇచ్చిన తీర్పును మార్పు చేయాలంటూ దాఖలైన పిటిషన్​ను కొట్టివేసింది ఎన్​సీఎల్​ఏటీ. డిసెంబర్​ 18న ఇచ్చిన తీర్పును మార్చే అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

BIZ-NCLAT-CYRUS-TATA
BIZ-NCLAT-CYRUS-TATA

By

Published : Jan 6, 2020, 12:45 PM IST

సైరస్​ మిస్త్రీ కేసులో రిజిస్ట్రీ ఆఫ్​ కంపెనీస్(ఆర్​ఓసీ)​ దాఖలు చేసిన పిటిషన్​ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎన్​సీఎల్​ఏటీ) కొట్టివేసింది. జస్టిస్​ ఎస్​.జె.ముఖ్తోపాధ్యాయ ఛైర్మన్​గా ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం.. డిసెంబర్​ 18 తీర్పును మార్చేందుకు తగిన కారణాలు లేవని తెలిపింది.

టాటా సన్స్ కార్యనిర్వహక అధ్యక్షుడిగా సైరస్ మిస్త్రీని పునర్​నియమించాలని ఎన్​సీఎల్​ఏటీ.. 2019 డిసెంబర్​ 18న తీర్పునిచ్చింది. మిస్త్రీ నియామకం నాలుగు వారాల తర్వాత అమల్లోకి వస్తుందని.. ఈ లోపు టాటా సన్స్​ అప్పీలుకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు తీర్పును మార్పు చేయాలంటూ ఆర్​ఓసీ వ్యాజ్యం దాఖలు చేసింది.

సుప్రీం కోర్టుకు టాటా

గతేడాది డిసెంబర్​ 18న ట్రైబ్యునల్​ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రతన్​ టాటా.. కేసు రికార్డులకు అనుగుణంగా తీర్పు లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు టాటా. రతన్​తో పాటు టాటా సన్స్​, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​) కూడా సుప్రీంలో వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details