తెలంగాణ

telangana

ETV Bharat / business

సుప్రీం కోర్టుకు టాటా సన్స్​, సైరస్​ మిస్త్రీ వివాదం

టాటా సన్స్​, సైరస్​ మిస్త్రీ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. మిస్త్రీని ఛైర్మన్​గా నియమించాలని జాతీయ కంపెనీ అప్పీలేట్​ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేసింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

tata
సుప్రీం కోర్టుకు టాటా సన్స్​, సైరస్​ మిస్త్రీ వివాదం

By

Published : Jan 2, 2020, 2:06 PM IST

Updated : Jan 2, 2020, 2:13 PM IST

కంపెనీ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకానికి అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్​సీఎల్​ఏటీ) ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ టాటా సన్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డు సమావేశం నేపథ్యంలో ట్రైబ్యునల్‌ తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని అభ్యర్ధించింది.

టాటా సన్స్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకానికి అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ గతేడాది డిసెంబర్‌ 18న తీర్పు వెలువరించింది. మిస్త్రీ పునర్నియామకం 4 వారాల తర్వాత అమలులోకి వస్తుందని తెలిపిన ట్రైబ్యునల్‌ ఈ లోపు టాటా సన్స్‌ అప్పీలుకు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

డిసెంబర్‌ 18న ఇచ్చిన తీర్పులో మార్పులు చేయాలంటూ రిజిస్ట్రర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ట్రైబ్యునల్‌ శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ట్రైబ్యునల్‌ కంపెనీల చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల మధ్య తేడాను వివరించాలని కార్పొరేట్ వ్యవహారాల శాఖను ఆదేశించింది.

ఇదీ చూడండి:ఆరు నెలల్లో 15 శాతం పెరిగిన 'ఎఫ్​డీఐ'లు

Last Updated : Jan 2, 2020, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details