తెలంగాణ

telangana

ETV Bharat / business

అక్కడి కాంగ్రెస్​ అభ్యర్థికి అంబానీ మద్దతు..! - అంబానీ

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తరచుగా తన ప్రసంగాల్లో రఫేల్​ ఒప్పందంలో అనిల్​ అంబానీకి అనుచిత లబ్ధి చేకూరిందని ఆరోపిస్తూ ఉంటారు. అయితే దక్షిణ ముంబయి లోక్​సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు అనిల్​ అంబానీ సోదరడు ముఖేశ్ మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.

అక్కడి కాంగ్రెస్​ అభ్యర్థికి అంబానీ మద్దతు..!

By

Published : Apr 19, 2019, 10:41 AM IST

Updated : Apr 19, 2019, 11:19 AM IST

కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు మద్దుతు పలికిన ముఖేశ్​ అంబానీ

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్​ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఏ రాష్ట్రానికి ప్రచారానికి వెళ్లినా రఫేల్​ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. రఫేల్​ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపారి అనిల్​ అంబానీకి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు. ఈ తరుణంలో అనిల్​ అంబానీ సోదరుడు, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్ ముఖేశ్​ అంబానీ ఓ కాంగ్రెస్​ అభ్యర్థికి ఎన్నికల్లో మద్దతివ్వడం చర్చనీయాంశమైంది.

అసలు సంగతేంటి..?

మిలింద్​ దేవరా... మాజీ కేంద్ర మంత్రి. దక్షిణ ముంబయి లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్నారు. ఇటీవల ట్విట్టర్​లో ఆయన ఓ వీడియో పంచుకున్నారు. అందులో చిన్న వ్యాపారుల నుంచి వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, బ్యాంకింగ్​ దిగ్గజం ఉదయ్​ కోటక్​ దేవరాపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ ముంబయి నుంచి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.

"మిలింద్​ అచ్చమైన దక్షిణ ముంబయి వాసి. దాదాపు 10 ఏళ్లు దక్షిణ బాంబేకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణ ముంబయి నియోజకవర్గంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులపై మిలింద్​కు లోతైన అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను."
- ముఖేశ్​ అంబానీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ ఛైర్మన్

"ముంబయి వాసులవైపు దేవరా నిలబడతారని నాకు నిజంగా అనిపించింది. ఆయన కుటుంబానికి ముంబయితో విడదీయరాని సంబంధం ఉంది. మిలింద్​కు ముంబయితో మంచి బంధం ఉంది."
- ఉదయ్​ కోటక్, కోటక్​ మహీంద్ర బ్యాంకు ఎండీ

అంబానీ, కోటక్​ లాంటి దిగ్గజ వ్యాపారులు తనకు మద్దతుగా నిలవడం గౌరవంగా ఉందని దేవరా చెప్పారు. చిన్న వ్యాపారులు, పాన్​వాలాలు తన వెంట నిలవడం అంతే ఆనందాన్ని ఇస్తుందన్నారు.
పరిశ్రమలు, వ్యాపారాల్లో పేరెన్నికగన్న ముంబయి గళం గత ఐదేళ్లలో పార్లమెంటులో మూగబోయింది. అంబానీ, కోటక్​ మద్దతు పలకడం ఆనందంగా, గౌరవంగా ఉంది."
- మిలింద్​ దేవరా, కాంగ్రెస్​ నేత

ఎన్నికల్లో గెలిస్తే వ్యాపారహిత వాతావరణాన్ని తెచ్చేందుకు, ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తానని దేవరా హామీ ఇచ్చారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో దేవరా శివసేన అభ్యర్థి అరవింద్​ సావంత్​ చేతిలో ఓడిపోయారు.

Last Updated : Apr 19, 2019, 11:19 AM IST

ABOUT THE AUTHOR

...view details