తెలంగాణ

telangana

ETV Bharat / business

300 ఎకరాల్లో అంబానీ ఇల్లు- రెండో నివాసంగా మారబోతోందా? - mukesh ambani uk property

చుట్టూ పచ్చటి ఉద్యానవనాలూ వాటి మధ్యలో తెల్లని భవంతీ (Mukesh ambani uk property).. అందులో 49 పడక గదులూ ఈతకొలనులూ గోల్ఫ్‌కోర్సులతో కూడిన 300 ఎకరాల ఆ ఎస్టేట్‌ పేరే స్టోక్‌ పార్క్‌.. లండన్‌లోనే నంబర్‌ వన్‌ కంట్రీ క్లబ్‌.. సంపన్నుల ఆటవిడుపు.. అది ఇప్పుడు భారతీయ అపర కుబేరుడైన ముకేశ్‌ అంబానీ (Ambani new house) రెండో నివాసంగా మారబోతోందా?!

mukesh-ambani-new-house-in-uk
అంబానీ ఇల్లు

By

Published : Nov 21, 2021, 1:57 PM IST

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (Ambani new house) కుటుంబం లండన్‌లో కొన్న కొత్త ఇంటికి మారనుంది... అంటూ సోషల్‌మీడియాలో, పత్రికల్లో వార్తలు వచ్చాయి. అక్కడ నివాసం ఉంటారా లేక దాన్ని విశ్రాంతి గృహంగా మలచుకుంటున్నారా... అన్న విషయాన్ని పక్కన పెడితే అంబానీల కొత్త ఇల్లు (Mukesh ambani uk property) ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత విలువ పలికే (సుమారు 14 వేల కోట్ల రూపాయలు) నివాస భవంతి ముకేశ్‌ అంబానీకి ఇప్పటికే ఉంది. ముంబయిలోని సంపన్నులు ఉండే ఆల్టామౌంట్‌ రోడ్డులో 29 అంతస్తుల్లో ఉన్న 'ఆంటిలియా' భవంతి నిట్టనిలువుగా ఆకాశాన్ని అందుకుంటానన్నట్లు ఉంటుంది. కానీ ఇంటి చుట్టూ విశాలమైన ఖాళీస్థలం ఉండదు. కరోనా, లాక్‌డౌన్‌ల కారణంగా గత రెండేళ్లనుంచీ అంబానీ కుటుంబం ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. అందుకే పాత ఇంటికి భిన్నంగా సువిశాలమైన భవనంలో పచ్చని వాతావరణంలో హాయిగా సేదతీరేందుకు మరో ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకున్నట్లున్నారు. లండన్‌లో తొలి కంట్రీ క్లబ్‌గానూ ఖరీదైన రిసార్ట్‌గానూ పేరొందిన స్టోక్‌ పార్క్‌ను (Stoke Park Ambani) సొంతం చేసుకుని మార్పులు చేయించుకుంటున్నారు. దాంతో స్టోక్‌పార్క్‌లో క్లబ్‌ కార్యకలాపాలన్నీ తాత్కాలికంగా నిలిపి వేశారు కూడా. పైగా ఏటా ఆంటిలియాలోనే దీపావళి పండగ చేసుకునే ఆయన కుటుంబం, ఈసారి స్టోక్‌పార్క్‌కు వెళ్లడం, కరోనా దృష్ట్యా డాక్టర్‌ అందుబాటులో ఉండేలా ఆసుపత్రినీ ఏర్పాటుచేసుకోవడం, ముంబయి ఇంట్లో ఉండే మందిరం లాంటిదే అక్కడా కట్టించుకోవడంతో ఏకంగా కొత్త ఇంటికి మారిపోనున్నారన్న వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఎందుకంటే- ఇటీవల కాలంలో భారతీయ సంపన్నుల్లో అనేకమంది లండన్‌లో భవంతులు కొనుక్కుని అక్కడే నివసిస్తున్నారు. కానీ ముకేశ్‌ కుటుంబం తాము ఎక్కడికీ వెళ్లబోవడంలేదని స్పష్టం చేయడంతోపాటు కేవలం చారిత్రకంగా పేరొందిన ఈ గోల్ఫింగ్‌ రిసార్ట్‌ను వ్యాపారరీత్యా అభివృద్ధి చేసి ఆతిథ్య రంగంలో భారతీయుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలన్న ఉద్దేశంతోనే కొన్నామని చెబుతోంది.

ముకేశ్​ అంబానీ కొత్త ఇల్లు
విశాలంగా లండన్​లోని అంబానీ ఇల్లు

తెగ వెతుకుతున్నారట..

అయితే వాళ్లు వెళ్లినా వెళ్లకున్నా రిలయన్స్‌ అధినేత కొన్న ఆ ఎస్టేట్‌ (Mukesh ambani house) ఎలా ఉందో చూడాలని అంతా నెట్టింట్లో స్టోక్‌ పార్క్‌కోసం తెగ వెతికేస్తున్నారట. నిజానికి ఈ భవంతి, మొదట్లో నివాస భవనంగానే ఉండేది. ఆ తరవాతే లగ్జరీ హోటల్‌, స్పా, గోల్ఫ్‌ అండ్‌ కంట్రీ క్లబ్‌గా మారింది. ఫైవ్‌ స్టార్‌ హోటలూ, మరో మూడు రెస్టరెంట్లూ, స్పా, జిమ్‌, 13 టెన్నిస్‌ కోర్టులూ, గోల్ఫ్‌కోర్సూ, 49 పడక గదులూ, ఈత కొలనులూ.. వంటివెన్నో ఉన్న ఈ ఎస్టేట్‌లో జేమ్స్‌బాండ్‌ సిరీస్‌తోపాటు మరెన్నో హాలీవుడ్‌ సినిమాలు తీశారట. అదీగాక స్టోక్‌పార్క్‌ ఎస్టేట్‌ ఈనాటిది కాదు, దీనికి తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుత భవనాన్ని 1788లో జేమ్స్‌ వాట్‌ అనే ప్రముఖ ఆర్కిటెక్ట్‌ డిజైన్‌ చేశాడట. అమెరికాలోని వైట్‌హౌస్‌ భవనం కొంత వరకూ దీన్ని పోలి ఉండటం విశేషం.

లండన్​ స్టోక్​ పార్క్​లో అంబానీ ఇల్లు
సకల సదుపాయాలతో..

ఇవీ చూడండి:చదువు అంతంతే.. సంపద మాత్రం రూ.లక్షల కోట్లు!

'అంబానీ ఎక్కడికీ వెళ్లడం లేదు.. ఆ వార్తలు అవాస్తవం'

ABOUT THE AUTHOR

...view details