తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాలానికి అడ్డు గోడలు కూల్చిన అంబానీ!

డిజిటల్​ ప్రపంచానికి మరో 100 కోట్ల మందిని పరిచయం చేసేందుకు రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ చొరవ ఎంతో తోడ్పడుతోందని ఓ సర్వే వెల్లడించింది. సంచలన ఆఫర్లతో వచ్చిన 'రిలయన్స్ జియో'నే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది.

అంబానీ

By

Published : May 11, 2019, 12:00 PM IST

ఆసియాలో మరో వంద కోట్ల మందిని అంతర్జాలానికి అనుసంధానం చేసే ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకు మౌలిక వసతుల పరంగా అడ్డంకులు చాలా ఉన్నాయి. భారత్​లో రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ చొరవతో ఆ అడ్డంకులన్నీ సులభంగా తొలిగాయని ఓ ప్రముఖ సంస్థ సర్వే ద్వారా వెల్లడైంది.

ఆన్​లైన్​ ప్రయాణ సేవల రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న 'బుకింగ్ హోల్డింగ్స్​' చేసిన ఈ సర్వే... పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

రుగుతున్న సంపద కారణంగా చాలా దేశాల్లో కోట్లాది మంది పేదరికం నుంచి మధ్య తరగతి వారిగా మారుతున్నారని... ఫలితంగా అంతర్జాల వినియోగదార్ల డిమాండ్​ కూడా పెరుగుతుందని సర్వే పేర్కొంది.

భారత్​లో ఇలా...

సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 74 శాతం మంది అంతర్జాల సదుపాయం తప్పనిసరిగా మారిందని సమాధానమిచ్చారు. 79 శాతం మంది అంతర్జాల వినియోగానికి లింగభేదము అడ్డంకి కాదని వెల్లడించారు.

అత్యధిక మంది అంతర్జాలం తమ దేశంలోని ప్రతి ఒక్కరిలో భాగమైందని చెప్పారు. అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు, సామాజికంగా ఎదిగేందుకు ఇంటర్నెట్​ తోడ్పడుతుందని తెలిపారు.

జియోతో మారిన లెక్క...

భారత్​లో అంతర్జాలాన్ని అందరికీ పరిచయం చేసేందుకు ఉన్న అడ్డంకులను 'జియో'తో ముకేశ్​ అంబానీ తొలగించారని సర్వే పేర్కొంది.

ఇటీవలి గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి రిలయన్స్ జియోకు 306.7 మిలియన్ల మంది వినియోగదార్లు ఉన్నారు. వారు సగటున నెలకు 10.9 జీబీ డాటాను, 823 నిమిషాల వాయిస్​ కాల్స్ మాట్లాడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details