తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానానికి ముకేశ్ అంబానీ - వాణిజ్య వార్తలు

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్​ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ జాబితా ప్రకారం ముకేశ్​ ప్రస్తుత సంపద దాదాపు 60 బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది.

Mukesh Ambani
ముకేశ్​ అంబానీ

By

Published : Nov 29, 2019, 3:27 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ మరో రికార్డు సాధించారు. ప్రపంచ అపర కుబేరుల్లో తొమ్మిదో స్థానంలో నిలిచారు. ప్రముఖ సంస్థ ఫోర్బ్స్​ విడుదల చేసిన 'ద రియల్​-టైమ్​ బిలియనీర్స్​ జాబితా'లో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం ముకేశ్ అంబానీ సంపద 60 బిలియన్ డాలర్లు.

ఫోర్బ్స్​ జాబితాలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత.. జెఫ్​ బెజోస్​ అగ్రస్థానంలో నిలిచారు.

ఫోర్బ్స్​ విడుదల చేసిన ఈ జాబితా.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ సంపదను ట్రాక్​ చేస్తుంది. గురువారం సాయంత్రం 5 గంటల తర్వాతి సంపదల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది ఈ సంస్థ. ఫోర్బ్స్​ వార్షిక జాబితాలో ముకేశ్​కు 13వ స్థానం దక్కిన విషయం తెలిసిందే.

గత సెషన్​లో రిలయన్స్ షేరు విలువ గణనీయంగా పెరిగి కంపెనీ మార్కెట్​ క్యాపిటల్​ రూ.10 లక్షల కోట్లను దాటింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రపంచంలోనే తొలి 10 మంది అపర కుబేరుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. మార్కెట్​ క్యాపిటల్​లో రూ.10 లక్షల కోట్లను దాటిన తొలి భారత కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడం మరో విశేషం.

జాబితా వివరాలు ఇలా..

పేరు సంస్థ-పదవి సంపద (బిలియన్ డాలర్లలో)
జెఫ్​ బెజోస్ అమెజాన్-వ్యవస్థాపకుడు 113
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్​-సహ వ్యవస్థాపకుడు 107.4
బెర్నార్డ్​ ఆర్నల్ట్​ & ఫ్యామిలీ​ ఎల్​వీఎంహెచ్ (లగ్జరీ గూడ్స్​ కంపెనీ) ఛైర్మన్​ 107.2
వారెన్​ బఫెట్ బెర్క్​షైర్ హాత్​వే-సీఈఓ 86.9
మార్క్​ జుకర్​బర్గ్​ ఫేస్​బుక్-సీఈఓ 74.9
అమాన్సియో ఒర్టెగా ఇండిటెక్స్ ఫ్యాషన్​ గ్రూప్-ఛైర్మన్​ 69.3
లారీ ఎలీసన్​ ఒరాకిల్​-సహ వ్యవస్థాపకుడు 69.2
కార్లోస్​ స్లిమ్​ హెలు గ్రూపో కార్లో-సహ వ్యవస్థాపకుడు 60.9
ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్​-ఛైర్మన్​ 60
లారీ పేజ్​ ఆల్ఫాబెట్-సీఈఓ 59.6

ఇదీ చూడండి:'కార్పొరేట్ సుంకాలు.. పెట్టుబడులకు ముఖ్య సాధనం'

ABOUT THE AUTHOR

...view details