తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోలో మరో రూ.9,093 కోట్ల విదేశీ పెట్టుబడి - జియోకు వచ్చిన మొత్తం పెట్టుబడులు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. అబుదాబికి చెందిన ముబ్దాలా ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీ జియోలో రూ.9,093.60 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్​ ప్రకటించింది.

jog get huge investment
జియోలో మరో విదేశీ కంపెనీ పెట్టుబడి

By

Published : Jun 5, 2020, 10:27 AM IST

ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ఫేస్​బుక్ సహా ఐదు సంస్థలు జియోలో భారీగా పెట్టుబడి పెట్టగా.. ఆ జాబితాలో మరో కంపెనీ చేరింది. అబుదాబికి చెందిన 'ముబ్దాలా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ' జియోలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ముబ్దాలా ఇన్వెస్ట్​మెంట్​ కంపెనీకి 1.85 శాతం వాటను రూ.9,093.60 కోట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.

ముబ్దాలా వాటా కొనుగోలుతో కలిపి ఆరు వారాల్లోనే జియోకి మొత్తం రూ.87,655.35 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

'ముబ్దాలా' పెట్టుబడి తర్వాత జియో ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు, ఎంటర్​ప్రైజెస్​ విలువ రూ.5.16 లక్షల కోట్లకు చేరినట్లు రిలయన్స్ వెల్లడించింది.

జియోలో విదేశీ కంపెనీల వాటాలు ఇలా..

జియోలో విదేశీ కంపెనీల వాటాలు

ఇదీ చూడండి:ఎయిర్‌టెల్‌లో అమెజాన్‌కు 5% వాటా!

ABOUT THE AUTHOR

...view details