సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) కారణం లేకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తే ఫిర్యాదులు చేయొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆమె ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వివరించేందుకు చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు.
ఫిర్యాదు చేసిన నకలును సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు పంపించాలని తెలిపారు ఆర్థిక మంత్రి.
భారత్ వద్ద ప్రస్తుతం విదేశీ మారకం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని, దేశ ఆర్థిక మూలాలు పటిష్ఠంగా ఉన్నాయని నిర్మల తెలిపారు. బడ్జెట్లో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా అధికారులు కృషి చేశారని చెప్పారు.