తెలంగాణ

telangana

ETV Bharat / business

వన్‌ప్లస్‌ నార్డ్‌కి పోటీగా మోటో 5జీ మొబైల్‌ - Moto 5G phone in India news updates

భారత్ మార్కెట్లోకి మరో 5జీ మొబైల్​ రానుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌కి పోటీగా మోటో 5జీ మొబైల్‌ తీసుకురానుంది మోటోరోలా. ఈ నెల 30న సరికొత్త ఫీచర్లతో మోటో జీ 5జీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.

most affordable 5G smartphone in India on November-30
వన్‌ప్లస్‌ నార్డ్‌కి పోటీగా మోటో5జీ మొబైల్‌

By

Published : Nov 27, 2020, 5:36 AM IST

భారత్‌లోకి 5జీ మొబైల్స్‌ రాక మొదలైంది. వన్‌ప్లస్‌ ఇప్పటికే 'నార్డ్‌' సిరీస్‌తో రాగా, మోటోరోలా సిద్ధమైంది. ఈ నెల 30న మోటో జీ 5జీని తీసుకొస్తున్నారు. ధర, స్పెసిఫికేషన్ల విషయంలో వన్‌ప్లస్‌‌ నార్డ్‌ మొబైల్‌కు పోటీగా నిలుస్తుందని అంటున్నారు. మోటోరోలా నుంచి ఇప్పటికే 5జీ సాంకేతికతతో 'రేజర్‌‌ 5జీ' స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది. అయితే దాని ధర సామాన్య వినియోగదారుడికి అందనంత ఎత్తులో ఉంది. దాంతో పోలిస్తే మోటోజీ 5జీ తక్కువ ధరలో దొరకబోతోంది. ఇప్పటికే ఐరోపా‌ మార్కెట్లో విడుదలైన ఈ మొబైల్‌ ఇప్పుడు మన దేశంలోకి వస్తోందన్నమాట.

మోటో జీ 5జీ మొబైల్‌ ఫీచర్స్‌:

  • 6.7 అంగుళాల, ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • 6 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌(మెమొరీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉంది)
  • 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం(ఇది 20 వాట్‌ పాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది)
  • మొబైల్‌లో మూడు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటుంది.
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • రూ.25 వేలకు దగ్గరల్లోనే మోటో 5జీ ఫోన్‌ ధర ఉండొచ్చని సమాచారం

మరోవైపు వివో కూడా 5జీ ఫోన్‌ సిద్ధం చేస్తోందట. వివో వి20 పేరుతో త్వరలో 5జీ మొబైల్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ మొబైల్‌ కూడా మోటో జీ 5జీ తరహాలోనే ఉంటాయట. ధర విషయంలో కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు. సుమారు ₹30 వేల ధరలో ఈ మొబైల్‌ తీసుకొస్తారని భోగట్టా.

ఇదీ చూడండి:పొకో ఎం3, రెడ్‌మీ తొలి 5జీ ఫోన్‌.. ఫీచర్లివే!

ABOUT THE AUTHOR

...view details