తెలంగాణ

telangana

ETV Bharat / business

దిగ్గజ కంపెనీల రేటింగ్​పై మూడీస్​ దెబ్బ

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో భారత్​లో పెద్ద ఎత్తున ప్రముఖ కంపెనీల రేటింగ్​ను దిగువకు సవరించింది మూడీస్​. మూడీస్​ రేటింగ్ తగ్గించిన సంస్థల్లో టెక్​ దిగ్గజాలు టీసీఎస్​, ఇన్ఫోసిస్​ సహా బ్యాకింగ్ దిగ్గజాలు ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీలు ఉన్నాయి.

moodys downgrades firms ratings
దిగ్గజ సంస్థల రేటింగ్​కు మూడీస్ గండి

By

Published : Jun 2, 2020, 5:57 PM IST

భారత సార్వభౌమ రేటింగ్​ను తగ్గించిన మరుసటి రోజే 8 ఆర్థికేతర రంగ సంస్థల రేటింగ్​ను దిగువకు సవరించింది మూడీస్ ఇన్వెస్టర్స్. ఇన్ఫోసిస్, టీసీఎస్​, ఓఎన్​జీసీ, హెచ్​పీసీఎల్, ఆయిల్​ ఇండియా, ఐఓసీ, బీపీసీఎల్, పెట్రోనెట్ ఎల్​ఎన్​జీ రేటింగ్​లను తగ్గించింది. వీటి భవిష్యత్ అంచనాలు ప్రతికూలంగా ఉంచింది మూడీస్.

మూడు దిగ్గజ బ్యాంకులు ఎన్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, ఎగ్జిమ్ బ్యాంక్ రేటింగ్​ను బీఏఏ 2 నుంచి బీఏఏ 3కు తగ్గించింది. వీటి భవిష్యత్ అంచనాలనూ నెగెటివ్​గా ఉంచింది మూడీస్.

వీటితో పాటు దేశంలోని ఏడు ప్రధాన మౌలిక సదుపాయాల సంస్థలైన ఎన్​టీపీసీ, ఎన్​హెచ్​ఏఐ, గెయిల్, అదానీ గ్రీన్​ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్​ల రేటింగ్​ను తగ్గించింది.

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం, సావరిన్ రేటింగ్ తగ్గింపు వంటి అంశాలు ఈ సంస్థల రేటింగ్​లో కోతకు ప్రధాన కారణంగా మూడీస్ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details