రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు అంతర్జాతీయ వ్యాపారాల్లో విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌తో ముగిసిన త్రైమాసికానికి నికర విక్రయాలు.. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం వృద్ధితో 29.6 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ప్రకటించింది.
'బిగ్ బిలియన్ డే సేల్స్'తో.. ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేలలో నెలవారీ యాక్టివ్ యూజర్లు జీవనకాల గరిష్టానికి చేరడం, కెనడా, మెక్సికోల్లో వ్యాపారాల్లో నమోదైన విక్రయాల వృద్ధి ఇందుకు కలిసొచ్చినట్లు వాల్‌మార్ట్ తెలిపింది.
విక్రయాలపై కరోనా ప్రభావం పడినప్పటికీ.. అక్టోబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి వాల్‌మార్ట్ ఆదాయం 134.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 6.7 బిలియన్ డాలర్లు (5.2 శాతం) ఎక్కువ.