తెలంగాణ

telangana

ETV Bharat / business

రోల్స్​ రాయిస్​ సంస్థపై మనీలాండరింగ్ కేసు

లండన్​కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్​ రాయిస్​పై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ క్రిమినల్​ కేసు నమోదు చేసింది. హెచ్​ఏఎల్​, ఓఎన్​జీసీ ఇతర సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందేందుకు మధ్యవర్తికి రూ.77 కోట్లు కమీషన్​గా ఇచ్చినట్లు పేర్కొంది.

By

Published : Sep 8, 2019, 11:33 PM IST

Updated : Sep 29, 2019, 10:40 PM IST

లండన్​ రోల్స్​ రాయిస్​ సంస్థపై మనీలాండరింగ్ కేసు

మనీలాండరింగ్​కు​ పాల్పడిందనే ఆరోపణలతో లండన్​కు చెందిన కార్ల తయారీ కంపెనీ రోల్స్​ రాయిస్​పై.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్​ (ఈడీ) క్రిమినల్​ కేసు నమోదు చేసింది. 2007-11 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్​ఏఎల్​, ఓఎన్​జీసీ, గెయిల్​ నుంచి కాంట్రాక్టులు పొందేందుకు ఓ ఏజెంట్​కు రూ. 77 కోట్లు కమీషన్​గా ఇచ్చిందని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ ఏడాది జులైలో ఈకేసుపై ఎఫ్ఐఆర్​ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఒప్పంద ఉల్లంఘన, ముడుపుల చెల్లింపు అంశాన్ని కూడా ఈడీ తేల్చనుంది.

హెచ్​ఏఎల్​, రోల్స్ రాయిస్​ మధ్య 2000-13 మధ్యకాలంలో రూ.4,700 కోట్ల వ్యాపారం జరిగినట్లు సీబీఐ పేర్కొంది.

రోల్స్‌రాయిల్‌, భారత్‌కు చెందిన దాని అనుబంధ సంస్ధ సహా సింగపూర్‌కు చెందిన ఆష్‌మోర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ యజమాని అశోక్‌ పత్ని, ముంబయిలోని టర్బోటెక్‌ ఎనర్జీ సర్వీసెస్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ సహా హెచ్​ఏఎల్, ఓఎన్​జీసీ, గెయిల్‌ అధికారులపై రక్షణ శాఖ ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది.

హెచ్​ఏఎల్​ నుంచి ఇంజిన్ల విడిభాగాల కాంట్రాక్టు కోసం రోల్స్‌రాయిస్‌ అశోక్‌ పత్నిని వ్యాపార సలహాదారుగా నియమించుకుని రూ.18 కోట్లు చెల్లించినట్లు సీబీఐ పేర్కొంది. 2007-10 మధ్యకాలంలో విడిభాగాల కోసం 68 ఆర్డర్లు ఇచ్చి ఒక మిలియన్​ బ్రిటిష్​ పౌండ్లు చెల్లించినట్లు తెలిపింది.

గెయిల్​, ఓఎన్​జేసీ సంస్థలకు మరమ్మతులు, ఇతర సేవలు చేయటానికి 2007లో రోల్స్​ రాయిస్​ పవర్ ఇంజినీరింగ్​ సంస్ధ ఒప్పందం చేసుకుంది.

ఇదీ చూడండి:ఆర్​ఎస్ఎస్​ భేటీలో 370 రద్దు, ఎన్​ఆర్​సీపై చర్చ

Last Updated : Sep 29, 2019, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details