తెలంగాణ

telangana

ETV Bharat / business

మైండ్ ​ట్రీ బై బ్యాక్​పై తొలగని ఉత్కంఠ - ఎల్​ అండ్​ టీ

షేర్ల బై బ్యాక్​ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మైండ్​ ట్రీ డైరెక్టర్ల బోర్డు తెలిపింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 26న మరోసారి సమావేశం కానున్నట్లు వెల్లడించింది.

మైండ్ ​ట్రీ

By

Published : Mar 22, 2019, 7:25 AM IST

షేర్ల బై బ్యాక్​ అంశంపై ఇటీవల జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మైండ్​ ట్రీ ప్రకటించింది. ఈ విషయంపై ఈనెల 26న మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపింది. మైండ్ ట్రీని చేజిక్కించుకునేందుకు ఎల్​ ఆండ్ టీ ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో బోర్డు సమావేశంపై ఆసక్తి నెలకొంది.

మైండ్​ ట్రీలో 31 శాతం వాటా కొనుగోలుకు ఈ వారం మొదట్లో రూ.10,800 కోట్లతో ఇంజనీరింగ్​ దిగ్గజం ఎల్ అండ్​ టీ చేసిన భారీ అఫర్​ను మైండ్​ ట్రీ డైరెక్టర్ల బోర్డు తిరస్కరించింది. లార్సెన్​ టూబ్రో (ఎల్​ అండ్​ టీ) ప్రయత్నాలు అడ్డుకునేందుకు వాటాదార్లు సంస్థకు సహకరించాలని మైండ్​ ట్రీ కోరింది. ఫలితంగా... షేర్ల బై బ్యాక్​ అంశం తెరపైకి వచ్చింది.

ఇదీ నేపథ్యం

మైండ్​ ట్రీ అనేది మధ్య రకపు ఐటీ కంపెనీ. ప్రమోటర్లు నడిపిస్తున్న కంపెనీగా పేరుంది. ఇందులో 21 శాతం వాటాతో కేఫ్ కాఫీ డే సంస్థ అధినేత సిద్ధార్థ 2018 వరకు డైరెక్టర్​ల బోర్డులో ఉన్నారు.

2018లో కేఫ్​ కాఫీ డే సంస్థలో నష్టాల కారణంగా మైండ్​ట్రీలో అయనకున్న 21 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ వాటాల కొనుగోలు ద్వారా మైండ్​ ట్రీ వ్యాపారంలోకి ప్రవేశించింది ఎల్​అండ్​ టీ.

ఇప్పటివరకు బాగానే ఉన్నా... ఎల్​ అండ్​ టీ వాటాను పెంచుకుని సంస్థను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఓపెన్​ మార్కెట్లో మరో 15 శాతం వాటా కొనుగోలుకు బ్రోకర్లను సంప్రదించింది ఎల్​ అండ్​ టీ. మరో 31 శాతం వాటా కొనుగోలుకు మైండ్ ​ట్రీకి ఓపెన్​ ఆఫర్ ప్రకటించింది. ఇలా సంస్థలో మొత్తం 66 శాతం వాటా కొనుగోలు చేయాలని ఎల్​ అండ్ టీ భావించింది. ఇదే జరిగితే మెజారిటీ వాటా ఉన్నందున సంస్థ ఎల్ అండ్ టీ అధీనంలోకి వెళ్తుంది.

ఇది గ్రహించిన మైండ్​ ట్రీ ఆత్మ రక్షణలో పడింది. సంస్థ చేతులు మారకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది.

ప్రస్తుతం మైండ్​ట్రీ ప్రమోటర్ల చేతులో ఉన్న 13 శాతం వాటాతో ఎల్​ అండ్​ టీ ప్రయత్నాలను అడ్డుకోవడం అసాధ్యం. అందుకే సంస్థ దగ్గర ఉన్న నిధులతో బై బ్యాక్​ అఫర్​ ద్వారా మెజారిటీ వాటా దక్కించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

సంబంధిత చట్టాలకు లోబడే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని మైండ్​ట్రీ ప్రమోటర్​, సీఈఓ రాస్తవ్​ రావనన్​ ఓ ప్రకటనలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details