ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి రిటైల్ స్టోర్లను తాత్కాలికంగా మూసేసింది మైక్రోసాఫ్ట్.
మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్లు శాశ్వతంగా బంద్ - మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్లు
ఆన్లైన్లో విక్రయాలు పెరిగిన నేపథ్యంలో రిటైల్ స్టోర్లను శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటిచింది సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 83 స్టోర్లకు స్వస్తి పలకనుంది.
మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోని సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 83 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో అమెరికాలోనే 72 స్టోర్లను కలిగి ఉంది. ఆన్లైన్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో రిటైల్ వ్యాపారం అంశమై వ్యూహాత్మకంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్, లండన్, సిడ్నీ, సంస్థ ప్రధాన కార్యాలయం రెడ్మాండ్ల్లోని నాలుగు హైప్రొఫైల్ స్టోర్లను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది.