అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. సోషల్ మీడియా యాప్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒక వైపు టిక్‌టాక్ కొనుగోలు చర్చలు జరుపుతూనే.. దేశీయ సోషల్ మీడియా యాప్ షేర్ చాట్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది
షేర్ చాట్‌లో మొత్తం 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షేర్ చాట్ సంస్థ ఇటీవల నిధులు సమీకరించాలని నిర్ణయించిన మొత్తంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి మూడో వంతుకు సమానమని తెలిసింది.