మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరో ఘనత సాధించారు. 2019 ఏడాదికిగానూ 'ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే 20 మంది వ్యాపారవేత్తలతో ఫార్చ్యూన్ జాబితాను వెలువరించింది. వ్యాపార ప్రపంచంలో నిశ్శబ్దమైన నాయకత్వంతో స్థిరమైన ఫలితాలు సాధించిన సత్య నాదెళ్లను.. బిజెనెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశామని ఫార్చ్యూన్ ప్రతినిధులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఫలితాలకు సత్య నాదేళ్ల నాయకత్వ శైలే కారణమని వివరించారు.