తెలంగాణ

telangana

ETV Bharat / business

నాలుగేళ్ల తర్వాత ఫోన్ల మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్​

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లోకి మైక్రోసాఫ్ట్‌ మళ్లీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో సర్ఫేస్‌ డ్యూయో అనే సరికొత్త రెండు తెరలుండే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ కంటే మరింత ఎక్కువ ఉపయోగాలు ఈ ఫోన్‌తో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ అంటోంది. అవేంటో.. దాని ధర ఎంతో తెలుసా!

Microsoft back in the smartphone business with its new Duo
మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫోన్​

By

Published : Aug 13, 2020, 7:49 AM IST

నాలుగేళ్ల కిందట మొబైల్‌ వ్యాపారాన్ని నిలిపివేసిన తర్వాత మళ్లీ మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లోకి వచ్చింది. బుధవారం సర్ఫేస్‌ డ్యూయో అనే సరికొత్త రెండు తెరలుండే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. సెప్టెంబరులో అమ్మకాలు మొదలయ్యే ఈ ఫోన్‌ ధర 1399 డాలర్లు(దాదాపు రూ.1,05,000). సంప్రదాయ స్మార్ట్‌ఫోన్‌ కంటే మరింత ఎక్కువ ఉపయోగాలు ఈ ఫోన్‌తో ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ అంటోంది. రెండు వేర్వేరు యాప్‌లు లేదా రెండు వెబ్‌పేజీలు ఒకే సారి వినియోగించుకోవచ్చని తెలిపింది. ఉదాహరణకు ఒక తెరపై అమెజాన్‌ కిండిల్‌ యాప్‌లో పుస్తకాన్ని చదువుతూనే, మరో తెరపై నోట్స్‌ తీసుకోవచ్చని తెలిపింది.

ఇవీ ప్రత్యేకతలు

పుస్తకంలాగా తెరవగలిగే ఈ ఫోన్‌కు 5.6 అంగుళాల రెండు తెరలు ఉంటాయి. 4.8 మిల్లీమీటర్ల మందంతో మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న అత్యంత పల్చటి ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. 8 జీబీ ర్యామ్‌, 512 జీబీ అంతర్గత మెమొరీ దీని సొంతం. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో పాలు ఇంకా పలు ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇదీ చూడండి:ప్రైవేటు రైళ్లకు జీఎంఆర్‌, మేఘా పోటీ

ABOUT THE AUTHOR

...view details