చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థ షియోమీ ఇప్పటికే భారత విపణిలోకి ఈ ఏడాది వివిధ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను తీసుకొచ్చింది. తాజాగా అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్‌ను తీసుకురానుంది. 108 మెగా పిక్సెల్ కెమెరాతో ఎంఐ సీసీ9 ప్రో (ఎంఐ నోట్ 10)ను ఇప్పటికే యూరోపియన్, చైనా మార్కెట్లలో ప్రవేశపెట్టింది. త్వరలోనే భారత విపణిలోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
భారత్ విపణిలో ఎంఐ నోట్ 10 విడుదలపై షియోమీ అంతర్జాతీయ ప్రతినిధి మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 108ఎంపీ కెమెరాతో పాటు 108ని సూచించే కెమెరా ఎమోజీలతో తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇంత ఎక్కువ మెగాపిక్సెల్ సెన్సార్‌తో మార్కెట్లోకి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే. భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ ఫోన్లకు నోట్ 10 గట్టి పోటీ ఇవ్వనుంది.
మను కుమార్ జైన్ ట్వీట్ నోట్ 10- ప్రత్యేకతలు..
- 108 ఎంపీ+20ఎంపీ+12ఎంపీ+5ఎంపీ కెమెరా.
- 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.
- 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్‌తో 6.47 అంగుళాల తాకే తెర.
- 2.2గిగా హెర్జ్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్.
- 5260ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.
- 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమోరీ కలిగిన నోట్ 10 ధర సుమారు రూ.43,200గా ఉండే అవకాశం ఉంది.
- ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్‌లాక్ సెన్సార్, ఫాస్ట్ ఛార్జీంగ్ నోట్ 10కు ఉన్న మరిన్ని ఫీచర్లు.
- గ్లాసియర్ వైట్, అరోరా గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ వంటి వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది.
ఎంఐ నోట్ 10 తో పాటు ఎంఐ మిక్స్ ఆల్ఫా ఫోన్‌ను కూడా భారత విపణిలోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది షియోమీ.
ఇదీ చూడండి: ఉంటుందా.. ఊడుతుందా? ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన