తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్​ వ్యవస్థాపకుడు గోయల్​కు లుక్​అవుట్​ జారీ

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్​కు లుక్​అవుట్​ తాఖీదులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. దేశాన్ని వీడేందుకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

నరేశ్​ గోయల్

By

Published : May 26, 2019, 7:01 AM IST

జెట్​ ఎయిర్​వేస్​ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్​కు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. దేశాన్ని వీడేందుకు అనుమతి నిరాకరిస్తూ లుక్​అవుట్​ నోటీసులు జారీ చేసింది. తన భార్య అనితా గోయల్​తో కలిసి లండన్​ వెళుతుండగా ముంబయి విమానాశ్రయంలో ఇమిగ్రేషన్​​ అధికారులు వారిని అడ్డుకున్నారు.

ఎమిరేట్స్​ ఎయిర్​వేస్​ ఈకే 507 విమానంలో దుబాయ్ మీదుగా లండన్​ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు గోయల్​ దంపతులు. అదే సమయంలో దేశాన్ని వీడి వెళ్లేందుకు హోంశాఖ అనుమతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రన్​వే పైకి వెళ్లిన విమానాన్ని తిరిగి వెనక్కి రప్పించారు ఇమిగ్రేషన్​ అధికారులు.

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన జెట్​ ఎయిర్​వేస్​ ఇటీవల తన సేవలను నిలిపివేసింది. నెలల తరబడి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ఈ కారణంగా గోయల్​తో పాటు సంస్థ డైరెక్టర్ల పాస్​పోర్టులను స్వాధీనం చేసుకోవాలని ముంబయి పోలీస్​ కమిషనర్​కు జెట్​ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిరణ్ పవాస్కర్ ఏప్రిల్​లో​ లేఖ రాశారు.

ఇమిగ్రేషన్​​ విభాగం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది. లుక్​అవుట్​ జారీ అయిన వ్యక్తులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు వీలుండదు.

ఇదీ చూడండి: 'జెట్​ను నిలబెట్టి మమ్మల్ని కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details