పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి ఆంటిగ్వా ప్రభుత్వం షాకిచ్చింది. న్యాయపరమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆ దేశం కల్పించిన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌన్ ప్రకటించారు. ఫలితంగా ఛోక్సీని భారత్కు అప్పగించేందుకు మార్గం సులువైంది.
"ఆయన(ఛోక్సీ) పౌరసత్వాన్ని మేం రద్దు చేస్తున్నాం. ఆయన్ను భారత్కు పంపించివేస్తాం. మా దేశం నేరస్థులకు ఆశ్రయం ఎన్నటికీ కాబోదు. అయితే మొదటగా మేం ఇందుకు అంగీకరించలేదు. కానీ ఛోక్సీ న్యాయపరమైన అంశాలను ఉల్లంఘించారు. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం."
-గ్యాస్టన్ బ్రౌన్, ఆంటిగ్వా ప్రధాని