తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతీ చిన్న కారు.. పెద్ద రికార్డు - ఆల్టో అమ్మకాల రికార్డు

బడ్జెట్​కార్లలో అత్యంత ఆధరణ పొందిన 'ఆల్టో'అమ్మకాలు 38 లక్షల మార్క్​ను దాటినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. ఎంట్రీ లెవెల్​లో కారు కొనాలనుకునే వారికి ఈ మోడల్​ తొలి ప్రాధాన్యంగా ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది.

alto
ఆల్టో చిన్నకారు

By

Published : Nov 26, 2019, 5:49 PM IST

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీకి చెందిన ఎంట్రీ లెవల్ చిన్న కారు 'ఆల్టో' అమ్మకాలు 38 లక్షల మైలురాయిని దాటాయి. 2000 సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మోడల్​.. 2008లో 10 లక్షలు.. 2012లో 20 లక్షలు.. 2016లో 30 లక్షల మార్క్​ను దాటినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత 15 ఏళ్ల నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న తమ మోడళ్లలో.. 'ఆల్టో' ప్రథమ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

"కొత్తగా కారు కొనాలనుకునేవారు మొదటి ప్రాధాన్యం 'ఆల్టో'నే. కాంపాక్ట్‌ డిజైన్‌, అందుబాటు ధరలో లభించడం, అధిక ఇంధన సామర్థ్యం, నవీకరించిన భద్రత పరమైన అంశాలు ఈ ఎంట్రీ లెవెల్‌ చిన్నాకారుకు అధిక ప్రాధాన్యాన్ని కల్పించాయి."
- శశాంక్ శ్రీవాస్తవ, మారుతీ సుజుకీ ఈడీ(మార్కెటింట్‌ అండ్‌ సేల్స్‌)

ఈ ఏడాది భారత్‌ స్టేజ్‌-6 ఆధారిత 'ఆల్టో'ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది మారుతీ సుజుకీ. యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌), ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌(ఈబీడీ), రివర్స్‌ పార్కింగ్ సెన్సార్‌, స్పీడ్‌ అలర్ట్‌ వ్యవస్థ, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ తదితర ఫీచర్లతో ఈ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి:అవినీతి అధికారులపై కేంద్ర ఆర్థిక శాఖ కొరడా

ABOUT THE AUTHOR

...view details