తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా 9వ నెలలోనూ తగ్గిన 'మారుతీ' జోరు!

వాహన రంగ సంక్షోభం కారణంగా ఉత్పత్తిని భారీగా తగ్గించింది మారుతీ సుజుకీ. గత ఏడాది అక్టోబర్​తో పోలిస్తే.. ఈ ఏడాది అదే నెలలో 20.7 శాతం ఉత్పత్తి తగ్గినట్లు పేర్కొంది. ఉత్పత్తి తగ్గించడం వరుసగా ఇది తొమ్మిదో నెల.

మారుతీ సుజుకీ

By

Published : Nov 10, 2019, 5:34 PM IST

వరుసగా తొమ్మిదో నెలలోనూ ఉత్పత్తిని భారీగా తగ్గించింది ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ. గత కొన్ని నెలలుగా మందగించిన కొనుగోళ్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2018 అక్టోబర్​తో పోలిస్తే.. గతనెల 20.7 శాతం ఉత్పత్తి తగ్గినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది.

2019 అక్టోబర్​లో మొత్తం 1,19,337 యూనిట్ల ఉత్పత్తి జరిగినట్లు పేర్కొంది. 2018 అక్టోబర్​లో ఈ సంఖ్య 1,50,497 యూనిట్లుగా ఉంది.

విభాగాల వారీగ ఉత్పత్తి వివరాలు..

విభాగం 2019 అక్టోబర్ 2018 అక్టోబర్
ప్యాసింజర్​ 1,17,383 యూనిట్లు 1,48,318 యూనిట్లు
మిని కాంపాక్ట్ 85,064 యూనిట్లు 1,08,462యూనిట్లు
యుటిలిటీ 22,526 యూనిట్లు 22,736 యూనిట్లు
మిడ్​-సెడాన్​ 1,922 యూనిట్లు 3,513 యూనిట్లు
సూపర్​ క్యారీ 1,954 యూనిట్లు 2,179 యూనిట్లు

ఇదీ చూడండి: 'ఉక్కు' సంకల్పమే.. ఆయన సామ్రాజ్యాన్ని నిర్మించింది

ABOUT THE AUTHOR

...view details