దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) దేశవ్యాప్తంగా 600 డీలర్ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వాహనాల డెలివరీ ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విక్రయ కేంద్రాల్లో సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ), వాహనాల కొనుగోలు కోసం డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.
"గత కొన్ని రోజులుగా మేము దేశవ్యాప్తంగా 600 బేసి డీలర్షిప్లను తిరిగి తీసుకురాగలిగాం. విక్రయ కేంద్రాలను ప్రారంభించేందుకు అనుమతులు తప్పనిసరిగా ఉన్న రాష్ట్రాల్లో డీలర్లు ఇప్పటికే దరఖాస్తు చేశారు. కార్ల డెలివరీలను ప్రారంభించింది. ప్రస్తుతానికి 55 యూనిట్లు అందించాం. దేశవ్యాప్తంగా మొత్తం సేల్స్ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొచ్చే విషయం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించే దానిపై ఆధారపడి ఉంటుంది. డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా డీలర్ల వద్ద సరిపడా స్టాక్ ఉంది."
– శశాంక్ శ్రీవాస్తవ, ఎంఎస్ఐ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సెల్స్