దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారీ రీకాల్ ప్రకటించింది. మల్టీ పర్పస్ వాహనమైన 'ఈకో' హెడ్ ల్యాంప్లో సమస్యలున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మొత్తం 40,453 ఈకో వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వివరించింది.
2019 నవంబర్ 4 నుంచి 2020 ఫిబ్రవరి 25 మధ్య తయారైన ఈకో వాహనాలకు మాత్రమే రీకాల్ వర్తిస్తుందని తెలిపింది.